»   » అల్లు అర్జున్ కొత్త మూవీ ‘డిజె-దువ్వాడ జగన్నాధమ్’ (ఫస్ట్ లుక్)

అల్లు అర్జున్ కొత్త మూవీ ‘డిజె-దువ్వాడ జగన్నాధమ్’ (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రం ఖరారైంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి మెగా ఫ్యామిలీకి 'గబ్బర్ సింగ్' లాంటి హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రానికి డి.జె....దువ్వాడ జగన్నాథమ్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

ఆర్య, పరుగు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తున్న మూడో చిత్రమిది. అంతే కాకుండా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న 25వ సినిమా కూడా ఇదే కావడం విశేషం.

 Allu Arjun and Director HarishShankar's DJ - Duvvada Jagannadham movie logo poster

బన్నితో ఆర్య, ఆర్య2, సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి సహా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఆర్య, బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తో రూపొందనున్న డి.జె....దువ్వాడ జగన్నాథమ్ చిత్రం రేపు (ఆగస్ట్ 29) హైదరాబాద్ హదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఉదయం 7గంటల 15 నిమిషాలకు లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

English summary
Allu Arjun and Director HarishShankar's DJ - Duvvada Jagannadham movie logo poster. A Dil Raju production.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu