డీజే టార్గెట్ ఇదే, వర్కౌట్ అయితే పంటపండినట్టే.! కానీ గెలుస్తాడా??

అల్లు అర్జున్‌ సినిమాల్లో రికార్డు ఓపెనింగ్స్‌ ఖాయంగా కనిపిస్తోన్న 'డిజె' ఇంతకీ హిట్‌ అవ్వాలంటే ఎంత కొట్టాలి?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'డిజె' సినిమా ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో... సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే ఈ సినిమాకు బన్నీ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడొస్తున్న పెద్ద సినిమాల్లో ముందుగా బాహుబలి 2 తరువాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి డిజె దువ్వాడ జగన్నాథమ్ రంగంలోకి దిగుతున్నాడు.

డిపెండబుల్ సూపర్ స్టార్

డిపెండబుల్ సూపర్ స్టార్

ఈ సినిమాతో అల్లు అర్జున్ గ్రాండ్ హిట్ కొట్టేస్తే.. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు కొడుతున్న పెద్ద స్టార్ల జాబితాలోకి చేరిపోవడమే కాదు.. రొటీన్ కథతో కూడా వరుస హిట్లు కొట్టగలిగే డిపెండబుల్ సూపర్ స్టార్ గా మారిపోతాడు. కాని అలా జరగాలంటే మాత్రం.. ఇప్పుడు పెద్ద మొత్తంలోనే వసూలు చేయాలి.

ఎనభై కోట్ల షేర్‌

ఎనభై కోట్ల షేర్‌

నైజాంలో పదిహేడు కోట్లు, ఉత్తరాంధ్రలో ఎనిమిది కోట్లు, సీడెడ్‌లో పదకొండు కోట్లు, కర్నాటకలో ఏడు కోట్లు బిజినెస్‌ జరిగిన ఈ చిత్రానికి మలయాళ వెర్షన్‌తో కలుపుకుని ఎనభై కోట్ల షేర్‌ వచ్చినట్టయితే బయ్యర్లకి ఖర్చులతో సహా గిట్టుబాటు అయిపోయినట్టే. అన్ని మల్టీప్లెక్సుల్లో భారీ సంఖ్యలో షోస్‌ పెట్టినప్పటికీ మొదటి మూడు రోజులకి టికెట్లు న్యూ ఇయర్‌ ఈవ్‌ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి.

నైజాం ఏరియాకి పదిహేడు కోట్లు

నైజాం ఏరియాకి పదిహేడు కోట్లు

నైజాం ఎప్పుడూ అల్లు అర్జున్‌కి కోటలాంటిదే. ఆర్య నుంచే అతని ఆధిపత్యం ఇక్కడ కనిపిస్తోంది. నైజాం కింది సెంటర్లలో అల్లు అర్జున్‌ కాస్త తక్కువే వున్నప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం తెలుగు చిత్ర సీమకి చెందిన ఏ పెద్ద స్టార్‌తోను అతను తీసిపోడు.నైజాం ఏరియాకి పదిహేడు కోట్లు పలికిన 'దువ్వాడ జగన్నాథమ్‌' ప్రస్తుతం కనిపిస్తోన్న ఊపుని బట్టి మొదటి మూడు రోజుల్లోనే పది కోట్ల షేర్‌ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

నైజాంలో ఇరవై కోట్ల క్లబ్‌లో

నైజాంలో ఇరవై కోట్ల క్లబ్‌లో

ఈ సినిమా కనుక నైజాంలో ఇరవై కోట్ల క్లబ్‌లో చేరినట్టయితే తదుపరి వచ్చే బన్నీ చిత్రానికి ఇక్కడ మరింత డిమాండ్‌ పెరుగుతుంది. బాహుబలి తర్వాత పెరిగిన మార్కెట్‌ నేపథ్యంలో, టికెట్‌ ధరలు కూడా పెంచి అమ్ముతున్నారు కనుక డీసెంట్‌ టాక్‌ వస్తే ఈ షేర్‌ వసూలు చేయడం అంత కష్టమేమీ కాదు. తొలి వారంలో రంజాన్‌ హాలిడే కూడా ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ అవుతుంది.

బన్నీ రెమ్యూనరేషన్

బన్నీ రెమ్యూనరేషన్

కాగా... ఈ సినిమాకు బన్నీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే విషయం హాట్ టాపిక్ అయింది. విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..... బన్నీ తన రెమ్యూనరేషన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో తీసుకున్నాడని తెలుస్తోంది.

థియేట్రికల్ రైట్స్.

థియేట్రికల్ రైట్స్.

కృష్ణ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి థియేట్రికల్ రైట్స్..... హక్కులను బన్నీకి రెమ్యూనరేషన్ గా దిల్ రాజు ఇచ్చారని, ఈ ఏరియాలో ఈ సినిమాకు మినిమమ్ 15 కోట్ల బిజినెస్ జరుగుతుందని సమాచారం. సినిమా బాగా ఆడితే బన్నీకి వచ్చే మొత్తం మరింత పెరగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X