అల్లు అర్జున్ ఒక్క పైసా తీసుకోకుండా ఫ్రీగా చేస్తున్నాడా?

By Bojja Kumar

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'రుద్రమదేవి' చిత్రంలో గోన గన్నారెడ్డి అనే స్పెషల్ రోల్ చేయడానికి ఒకే చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ పాత్ర చేయడానికి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది.

అదే గనుక నిజమైతే...గుణశేఖర్ చాలా లక్కీ అనే చెప్పాలి. పైగా అల్లు అర్జున్ ఈ చిత్రంలో నటించడం వల్ల సినిమాకు కనీసం 20 కోట్లు వసూళ్లు అధికంగా వస్తాయని అంచనా. ఎలాంటి రెమ్యూనరేషన్ ఆశించకుండా చేస్తున్న అల్లు అర్జున్ కోసం సినిమా విడుదలైన తర్వాత గుణశేఖర్ ఏదైనా గిఫ్టు ఇస్తాడా? లేదా? అనేది చూడాలి.

అనుష్క టైటిల్ రోల్‌లో గుణ టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణశేఖర్ రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రం 'రుద్రమదేవి'. ఈ పాత్ర చిత్రీకరణ ఈ రోజు(జులై 4)న హైదరాబాద్‌లోని గోపనపల్లిలో తోటతరణి సారథ్యంలో వేసిన ఏడు కోట గోడల భారీ సెట్లో ప్రారంభమైంది. గోన గన్నారెడ్డి పాత్ర చిత్రీకరణ జరుగుతోంది. తోట తరణి వేసిన ఏడు కోట గోడల సెట్‌లో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్‌తో చిత్రీకరణ ప్రారంభించారు. అల్లు అర్జున్‌తో పాటు వందలాది జూనియర్ ఆర్టిస్టులతో 40 రోజుల పాటు ఏక ధాటిగా షూటింగ్ జరుగుతుంది.

గోన గన్నారెడ్డి

గోన గన్నారెడ్డి


గోన గన్నారెడ్డి అల్లు అర్జున్ సరసన నటిస్తున్న కేథరిన్ కూడా పాల్గొంటారు. 40 రోజుల పాటు అల్లు అర్జున్ పాల్గొనే ఈ షెడ్యూల్‌తో రుద్రమదేవి దాదాపుగా పూర్తవుతుంది. ‘

డిసెంబర్లో విడుదల

డిసెంబర్లో విడుదల


రుద్రమదేవి' చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్ర స్పెషల్ గా ఉంటుంది. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏకధాటిగా షూటింగ్ జరుపుతున్నారు.

న్యూ షెడ్యూల్

న్యూ షెడ్యూల్

ఈ న్యూ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు అనుష్క, రానా, ప్రకాష్ రాజ్, కృష్ణం రాజు, హంసా నందిని ఇంకా చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటారు.

నటీనటులు

నటీనటులు

రుద్రమ దేవిగా అనుష్క నటిస్తున్న ఈ మూవీలో ఇంకా రానా, కృష్ణం రాజు, సుమన్, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, కేథరిన్, ప్రభ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్య మీనన్, ప్రసాదాదిత్య, అజయ్, విజయ్ కుమార్, వేణు మాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీ రాజా, సమ్మెట గాంధీ, అదితి చెంగప్ప, సన, రక్ష తదితరులు నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇతర వివరాలు

ఇతర వివరాలు

ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కాస్ట్యూమ్ డిజూనర్: నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఫైట్స్: విజయ్, కాస్ట్యూమ్స్: వి.సాయి బాబు, మేకప్: రాంబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్ గోపాల్, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ, కథ-స్ర్కీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: గుణశేఖర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X