»   »  చెన్నై నన్ను హీరోను చేసింది: అల్లు అర్జున్ భారీ విరాళం!

చెన్నై నన్ను హీరోను చేసింది: అల్లు అర్జున్ భారీ విరాళం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరదలతో అతలాకుతలం అవుతున్న చెన్నై నగరానికి సహాయం చేయడానికి టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ భారీ విరాళం ప్రకటించారు. రూ. 25 లక్షల విరాళం అందిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘చెన్నై వరద బాధితులకు రూ. 25 లక్షల విరాళం అందించాలని నిర్ణయించుకున్నాను. నేను నా తొలి 18 ఏళ్ల జీవితం అక్కడే గడిపాను. నన్ను ఇపుడు మీ ముందు హీరోగా నిలబెట్టిన నగరం. ఐలవ్ యూ చెన్నై అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసారు.

Allu Arjun donate 25 lakhs to Chennai Flood relief

మహేష్ బాబు 10 లక్షలు
మహేష్ బాబు మాట్లాడుతూ...భారీ వర్షాలు, వరదల వల్ల ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న చెన్నై ప్రజానీకం ఈ విపత్కర పరిస్తితి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నా వంతు సహాయంగా రూ. 10 లక్షలు సిఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాను అన్నారు.

ఎన్టీఆర్ 10 లక్షలు, కళ్యాణ్ రామ్ 5 లక్షలు
"చెన్నైతో మాకు ఉన్న అనుబంధం మరువలేనిది. అటువంటి మహానగరం నుండి నేడు వస్తోన్న చిత్రాలను చూస్తోంటే చాలా బాధ గా ఉంది. ప్రజలు ధైర్యం కోల్పోకుండా ఉండవలసిన సమయం ఇది. సహాయం అందించగలిగిన ప్రతి ఒక్కరు స్పందించాల్సిన సమయం ఇది. మా తరపున ఆర్ధిక సహాయాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాం. చెన్నై త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం", అని ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తెలిపారు.

రవితేజ 5 లక్షలు
మాస్ మహరాజ్ రవితేజ చెన్నై వరద బాధితులకు రూ. 5 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.

వరుణ్ తేజ్
యువ నటుడు వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నట్లు గా అయన తెలిపారు.

సంపూర్ణేష్ బాబు రూ. 50 వేల సహాయం ప్రకటించారు.

English summary
"I would like to donate 25 lakhs to Chennai Flood relief ! I spent 18yrs of my Early life there It made me who I am today. I love u Chennai" Allu Arjun tweeted.
Please Wait while comments are loading...