‘పుష్ప’లో బన్నీ ఒక్కడే కాదు.. ఇద్దరు హీరోలు: పోస్టర్‌లో ఉన్నది మరొకరు.. బయటపడ్డ రహస్యం!
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన పేరును దక్కించుకున్నాడతను. అద్భుతమైన యాక్టింగ్ చేస్తూ.. డ్యాన్స్‌లో అదరగొడుతూ.. ఫైట్స్ ఇరగదీస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక, సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బన్నీ 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆ మూవీలోని పోస్టర్ రిలీజ్ అయింది. దీంతో సినిమాలో ఇద్దరు హీరోలన్న విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...

సుదీర్ఘ కెరీర్‌లో మొదటి ఇండస్ట్రీ హిట్
'నా పేరు సూర్య' తర్వాత చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఆలస్యం అయినప్పటికీ.. గత ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'అల.. వైకుంఠపురములో'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడతను. ఈ భారీ మూవీ అద్భుతమైన స్పందనతో హిట్ టాక్‌ను అందుకోవడంతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఫలితంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

పాన్ ఇండియా బాటలో అల్లు అర్జున్
'అల' హిట్ తర్వాత మాంచి జోష్ మీద ఉన్నాడు అల్లు అర్జున్. ఈ ఉత్సాహంతోనే గతంలో తనతో 'ఆర్య', 'ఆర్య2' వంటి చిత్రాలను తెరకెక్కించిన సుకుమార్‌తో ప్రస్తుతం 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందనుంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది.

సినిమా కోసం కొత్తగా చేస్తున్నాడుగా
భారీ బడ్జెట్‌తో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతుండడంతో 'పుష్ప' మూవీ కోసం అల్లు అర్జున్ ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. ఇందులో గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటించనున్న అతడు.. లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అలాగే, చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడబోతున్నాడు. డీ గ్లామర్‌గా ఉండే ఈ రోల్ కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

రిలీజ్ డేట్ ప్రకటించి షాకిచ్చిన పుష్ప
ఇటీవల కొత్త సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్లన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ సర్‌ప్రైజ్ రాబోతుందని గురువారం ఉదయమే 'పుష్ప' యూనిట్ వెల్లడించింది. అందుకు అనుగుణంగానే అదే సమయానికి మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆగస్టు 13, 2021న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అందులో వెల్లడించారు.

బన్నీ ఒక్కడే కాదు.. ఇద్దరు హీరోలు
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిస్తోన్న 'పుష్ప'ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇందులో అల్లు అర్జున్ మేకొవర్ చాలా కొత్తగా ఉంది. సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో ఎన్నో ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో ఇద్దరు హీరోలు ఉన్నారని ఓ న్యూస్ లీకైంది.
Recommended Video

పోస్టర్‌లో ఉన్నది మరొకరు.. లీకైంది
రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌లో అడవిలో పని చేసే కూలీలందరూ గొడ్డళ్లను పట్టుకుని కనిపించారు. వాళ్లకు అల్లు అర్జున్ నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇక, ఈ పోస్టర్‌లో హీరో కాలికి ఐదు వేళ్లు మాత్రమే ఉన్నాయి. గతంలో చూపించిన పోస్టర్‌లో బన్నీ కాలికి ఆరు వేళ్లు చూపించారు. ఈ రెండు ఫొటోలు గమనించిన వారంతా ఇందులో అతడు డుయల్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











