అల్లు శిరీష్ బర్త్ డే.. తమ్ముడి గురించి అల్లు అర్జున్ ఎమోషన్ ట్వీట్!
అల్లు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య అప్యాయతలు చక్కగా ఉంటాయని సినీ వర్గాల అభిప్రాయం. అందుకు తగినట్టుగానే తాజా ఫోటో రుజువు చేసింది. మే 30న నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ జన్మదినం. ఆ సందర్బంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలితో కలిసి శిరీష్ జన్మదినాన్ని ముచ్చటగా జరుపుకొన్నారు.
నా కళ్ల ముందే పెరిగి
నా జీవితంలో మొదటి చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ పిల్లాడు నా కళ్లముందే పెరిగి పెద్దయ్యాడు. నా జీవితంలో మధురమైన అనుభవాలు, సీక్రెట్స్ అతడితో పంచుకొన్నాను. నా చిన్నారి తమ్ముడు సిరి.. జన్మదిన శుభాకాంక్షలు అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్
అల్లు అర్జున్, తన సతీమణి స్నేహారెడ్డి, కూతురు, కుమారుడితో కలిసి అల్లు శిరీష్ కేక్ కట్ చేశారు. ఈ ఫోటోను అల్లు అర్జున్ షేర్ చేశారు. దాంతో ఈ ఫోటో వైరల్ అయింది. సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభించింది.

బర్త్ డే గురించి అల్లు శిరీష్
ఇటీవల తన జన్మదినం జరుపుకొనే అంశం గురించి వివరిస్తూ స్కూల్ డేస్‌లో నా బర్త్ డే ఎప్పడూ సమ్మర్ వెకేషన్‌లో వస్తుండేది. దాంతో ఫ్రెండ్స్ ఎవరూ అందుబాటులో ఉండేవారు కాదు. అందుకే ఎక్కువగా బర్త్ డే జరుపుకోలేదు. మహా అంటే మూడుసార్లు మాత్రమే జరుపుకొన్నాను. సినీ రంగంలోకి వచ్చిన తర్వాత మీడియా మిత్రులతో, ఫ్యామిలీ మెంబర్స్‌తో జరుపుకొంటున్నాను అని అల్లు శిరీష్ అన్నారు.

అన్నయ్య సలహాలు తీసుకొంటాను
నా కెరీర్‌లోనూ, జీవితంలోనూ నాన్న, అన్నయ్యలదే కీలకపాత్ర. నా సినిమాల విషయంలో, జీవితంలో ఏదైనా సందేహం ఏర్పడినప్పుడు వారిద్దరి సలహాలు తీసుకొంటాను. స్క్రిప్టులు, కథల గురించి వారితో చర్చిస్తాను అని అల్లు శిరీష్ తెలిపారు.


Click it and Unblock the Notifications











