మహేష్ బాబు తర్వాతి స్థానానికి చేరిన అల్లు అర్జున్!
ఆయన తర్వాతి స్థానంలో జూ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్ మరో బ్రాండ్‌కు ప్రచారం చేసే అవకాశం దక్కించుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటికే కోల్గెట్ మాక్స్‌ఫ్రెష్, 7అప్, జోయాలుకాస్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్ త్వరలో LOT అనే మొబైల్ రైటైల్ కంపెనీ తరుపున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.
కొత్తగా మొబైల్ ఫోన్ రిటైల్ రంగంలోకి అడుగు పెడుతునన LOT హీరో అల్లు అర్జున్‌ను రంగంలోకి ప్రచారం చేయించాలనే ఆలోచనలో ఉంది. ఇందుకు గాను అల్లు అర్జున్‌తో రూ. 2.5 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాడ్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ 'రేస్ గుర్రం' చిత్రంలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం యూరఫ్ లో జరుగుతోంది. దీంతో పాటు అల్లు అర్జున్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications












