బన్నీని భయపెట్టిన అభిమాని, ఫ్యాన్స్‌కు నిరాశ.. అల్లు అర్జున్ చెప్పినా ఒప్పుకోని హీరోయిన్స్!

Recommended Video

Allu Arjun Talks Speech @Geetha Govindam Audio Launch

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా గీత గోవిందం చిత్ర ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, యంగ్ బ్యూటీ రష్మిక మందన జంటగా జరించారు. శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం పూర్తి తాజాదనం, పాజిటివ్ బజ్ తో విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ మధ్యన విడుదలైన టీజర్ యువతని విపరీతంగా ఆకట్టుకుంది. మరో మారు విజయ్ దేవరకొండ అల్లరి కుర్రవాడిగా నటిస్తున్నాడు. ఆడియో వేడుకలో బన్నీ చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

 అతడి కోసమే

అతడి కోసమే

తాను ఈ ఆడియో వేడుకకు బన్నీ వాసు కోసమే వచ్చానని అల్లు అర్జున్ తెలిపాడు. బన్నీ వాసు తీసే ప్రతి చిత్రానికి గెస్ట్ గా వెళతానని బన్నీ తెలిపాడు. మా నాన్న చాలా సినిమాలు తీశారు. వాటన్నింటికి తాను వెళ్లలేదనే విషయాన్ని అల్లు అర్జున్ ప్రస్తావించాడు.

సినిమా చూసేశా

సినిమా చూసేశా

తాను గీత గోవిందం చిత్రం కొద్దిరోజుల క్రితమే చూశానని అల్లు అర్జున్ తెలిపాడు. సినిమా చాలా బావుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవడం ఖాయం అని బన్నీ తెలిపాడు.

భయపెట్టిన అభిమాని

భయపెట్టిన అభిమాని

బన్నీ ప్రసంగం మధ్యలో ఓ అభిమాని స్టేజిపైకి అనూహ్యంగా దూసుకువచ్చాడు. అమాంతం బన్నీ కాళ్లపై పడ్డాడు. వెంటనే స్పందించిన బౌన్సర్లు అతడిని పక్కకు తీసుకునివెళ్లేందుకు ప్రయత్నించగా బన్నీ ఆ అభిమానిని సముదాయించి పంపాడు.

పరుగు సినిమా నుంచి

పరుగు సినిమా నుంచి


ఈ చిత్ర దర్శకుడు పరశురామ్ తనకు పరుగు చిత్రం నుంచి తెలుసు అని అల్లు అర్జున్ తెలిపాడు. ఆ చిత్రానికి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆయన కోసం గీత గోవిందం చిత్రం బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు బన్నీ తెలిపాడు.

స్టార్ హీరోయిన్స్ ఒప్పుకోలేదు

స్టార్ హీరోయిన్స్ ఒప్పుకోలేదు

చాలా రోజుల క్రితమే ఈ చిత్ర కథ విన్నా. స్టార్ హీరోయిన్స్ లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి కథ ఉంటె చెప్పమని గతంలో నన్ను అడిగారు. గీత గోవిందం కథ వారికి చెప్పా. ఎవరూ ఒప్పుకోలేదని అల్లు అర్జున్ తెలిపాడు. ఈ చిత్రం రష్మిక కోసమే రాసిపెట్టి ఉందని బన్నీ ఆడియో వేడుక వేదికగా తెలిపాడు.

అర్జున్ రెడ్డికి ఫిదా

అర్జున్ రెడ్డికి ఫిదా

తాను అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ చూసి ఫిదా అయ్యానని బన్నీ తెలిపాడు. తాను అనుకున్నట్లుగానే విజయ్ దేవరకొండకు ఆ చిత్రంలో బెస్ట్ ఫిలిం ఫేర్ అవార్డు వచ్చిందని అల్లు అర్జున్ తెలిపాడు.

హీరోయిన్ కథ

హీరోయిన్ కథ

గీత గోవిందం చిత్రం హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండే కథ. కానీ విజయ్ దేవరకొండ తన పెర్ఫామెన్స్ తో సమతూకంగా మార్చేశాడని బన్నీ ప్రశంసించాడు. రష్మిక అద్భుతంగా నటించిందని తెలిపాడు.

మంచి కారు కావాలి

మంచి కారు కావాలి

ఈ చిత్రాన్ని బన్నీ వాసు, అల్లు అరవింద్ ఇద్దరూ కలసి నిర్మిస్తున్నారు. ఆడియో వేడుక వేదికగా తన తండ్రిని బన్నీ ఓ కోరిక కోరాడు. డాడీ ఈ సినిమాతో బాగా డబ్బులు సంపాదించి నాకు మంచి కారు కోనివ్వు అని సరదాగా వ్యాఖ్యానించాడు.

నిరాశపరిచిన బన్నీ

నిరాశపరిచిన బన్నీ

బన్నీ ప్రసంగం చివర్లో అభిమానులకు నిరాశే మిగిలింది. తరువాతి సినిమా ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ కేకలు వేయడంతో అల్లు అర్జున్ స్పందించాడు. తరువాత సినిమా ఆలస్యం అవుతుందని, ఎదురుచూడగా తప్పదని బన్నీ ఫాన్స్ కు తెలిపాడు. నా పేరు సూర్య చిత్రం తరువాత బన్నీ మరో సినిమా ప్రారంభించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X