రామ్ చరణ్ చిత్రం రిలీజే రోజే...అల్లు అర్జున్ ఎంగేజ్ మెంట్
అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ఎంగేజ్ మెంట్ ని ఈ నెల 26న జరుపుతున్నారు. అదే రోజు రామ్ చరణ్ తాజా చిత్రం ఆరెంజ్ రిలీజ్ రోజే కావటం విశేషం. అయితే ఆ రోజు ఆరెంజ్ రిపోర్టులు హడావిడిలో రామ్ చరణ్, చిరంజీవి, నాగబాబు బిజీగా ఉంటారు కదా ఆ రోజే ఎందుకు ఎంగేజ్ మెంట్ పెట్టుకున్నాడని సన్నిహితులకు సందేహం కలుగుతోంది. అయితే జ్యోతిష్యులు ఇద్దరి జాతకాలు చూసి ఆ రోజే మంచి రోజుని, ఇప్పుడు కాదనుకుంటే మళ్ళీ జనవరి నెలాఖారు వరకూ డేట్స్ లేదని చెప్పారని తెలుస్తోంది. ఇక వీరి వివాహం మాత్రం బద్రీనాధ్ చిత్రం రిలీజ్ అనంతరం ఉంటుందంటున్నారు. తమన్నా...అల్లు అర్జన్ సరసన నటిస్తోంది. ఇక "బద్రీనాధ్" చిత్రం మార్చి 27, 2011న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ రోజు రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు కావటం మరో విశేషం. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బన్నీ తర్వాత వివి వినాయిక్..అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇదే.


Click it and Unblock the Notifications











