అడ్డంగా దొరికిన అల్లు అర్జున్.. నేషనల్ అవార్డ్ విషయంలో అబద్దమా.. నెటిజన్ల ట్రోలింగ్

భారతీయ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు ఉన్నత అవార్డ్స్ లో జాతీయ పురస్కారం కూడా ఒకటని తెలిసిందే. కాగా ఈ నేషనల్ అవార్డ్స్ ని భారతీయ సినిమా నటీనటులు సహా టెక్నీషియన్స్ కూడా గెలుపొందిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇన్నేళ్ల సినిమాలో చాలా భాషల్లో నటీనటులకు ఉత్తమనటులుగా అవార్డు వస్తే అది వాళ్ళకి ఎంతో గొప్ప అంశంగా భావిస్తారు.

అయితే ఇన్నేళ్ల జాతీయ అవార్డ్స్ చరిత్రలో మన తెలుగు సినిమాకి చెందిన నటీనటుల్లో అయితే ఎవరికీ వచ్చింది లేదు. దీనితో ఎన్నో ఏళ్ళు నుంచి తెలుగు సినిమా నటీనటులకు ఇది అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. అలా అని తెలుగు సినిమా దగ్గర దిగ్గజ నటీనటులు లేరా అంటే ఎంతోమంది ఉన్నారు పలు సినిమాల్లో అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ని కూడా అందించారు అయినప్పటికీ కూడా ఒక్క నేషనల్ అవార్డు ఒక్కరికీ రాలేదు.

allu arjun exposed on his national award winning

కానీ అది సాధించిన వన్ అండ్ ఓన్లీ హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే నిలిచాడు. దీనితో తెలుగు సినిమా దగ్గర చరిత్ర సృష్టించిన ఒకే ఒక్క హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. సరే ఇది బాగానే ఉంది కానీ నేషనల్ అవార్డు విషయంలో బన్నీ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు చర్చకు దారి తీశాయి. రీసెంట్ గా బన్నీ నందమూరి నటసింహం బాలయ్య టాక్ షోలో తాను హాజరయ్యాడు.

ఆ ప్రోమోలో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలవడంపై పలు క్రేజీ కామెంట్స్ చేసాడు. మన తెలుగు సినిమా దగ్గర ఎవరికీ అవార్డు లేదని తెలుసుకొని షాకయ్యను ఇది ఎలాగైనా కొట్టాలి అని ఒక మార్క్ పెట్టుకున్నాను అలా కొట్టాను అంటూ చేసాడు. అయితే ఇది మాత్రం ఇది పూర్తిగా అబద్దం అని ఇపుడు తేలిపోయింది. ఇదే నేషనల్ అవార్డు గెలిచిన తర్వాత ఇచ్చిన అవార్డు గెలవడంపై చేసిన కామెంట్స్ ఇపుడు బయటకి వచ్చాయి.

allu arjun exposed on his national award winning

ఇపుడు తాను ఏదైతే కామెంట్స్ ఎవరికీ రాలేదు అన్నాడో అప్పుడు ఏమి చెప్పాడు అంటే తనకి నేషనల్ అవార్డు వచ్చినపుడు నమ్మలేకపోయాను అని తెలుగులో ఉత్తమ నటుడుగా అవార్డు గెలిచిన హీరోగా ఏ మూడో వాడినో నాలుగో వాడినో అనుకున్నాను అని ఆ తర్వాత నేనే మొదటి వాడిని అని తెలుసుకున్నాను అని చెప్పాడు. దీనితో అప్పటికి ఇపుడు బన్నీ ఎంతలా మాట మార్చేసాడో అర్ధం చేసుకోవచ్చు. దీనితో ఇప్పటికే అల్లు అర్జున్ కామెంట్స్ పై ట్రోల్స్ వస్తున్నాయి.

వీటికి తోడు ఆ కామెంట్స్ పచ్చి అబద్దం అని తేలడంతో తనపై మరిన్ని కామెంట్స్ పడుతున్నాయి. దీనితో ఇప్పటికే అల్లు అర్జున్ పై చాలా చాలా నెగిటివిటీ ఉంది. దానికి తోడు ఇపుడు ఇవి యాడ్ అయ్యాయి. మరి ఇంతలా అల్లు అర్జున్ పచ్చి అబద్దాన్ని చెప్పుకోవడం అనేది తననే చిన్నగా చేసినట్టు అవుతుంది. మరి ఇప్పుడు ఉన్న నెగిటివిటీ చాలదు అన్నట్టు ఇపుడు కొత్త కొత్తవి బన్నీ తెచ్చుకుంటున్నాడు. ఇక ఇవి పక్కన పెడితే తన భారీ సినిమా పుష్ప 2 పనుల్లో బిజీగా ఉండగా ఈ చిత్రంని మేకర్స్ ఈ డిసెంబర్ 5న రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X