చిరంజీవి కలిసిన అల్లు అర్జున్ ఫ్యామిలీ... మెగా తాతయ్యను విష్ చేసిన అయాన్!
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన్ను విష్ చేసేందుకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి క్యూ కడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఫ్యామిలీ చిరంజీవి ఇంటికి చేరుకుని విష్ చేశారు. అల్లు అర్జున్ మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో బిజీగా ఉండగా.... ఆయన భార్య స్నేహారెడ్డి, కొడుకు, కూతురు వచ్చి పెద్దాయనకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు అయాన్ మెగా తాతయ్యకు తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రత్యేకంగా విషెస్ తెలిపాడట.
గతేడాది చిరంజీవి తన పుట్టినరోజు హైదరాబాద్ లో లేరు. దీంతో చాలా మందికి ఆయన్ను కలిసే అవకాశం లభించలేదు. ఈ సారి మెగాస్టార్ ఇంట్లోనే ఉండటంతో సినీ ప్రమఖులు, స్నేహితులు, బంధువులు స్వయంగా ఆయన ఇంటికి వచ్చి విష్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహా రెడ్డి' ఆయన పుట్టిరోజు సందర్భంగా విడుదల చేయగా 24 గంటల్లో 12 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించింది. టీజర్ అద్భుతంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సొంత బేనర్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











