దేవుడా ఇదేం ఫాలోయింగ్.. బన్నీ ఫ్యాన్స్ రచ్చ
స్టైలీష్ స్టార్, సదరన్ స్టార్, సౌత్ స్టార్ ఇలా ఏ ట్యాగ్‌తో పిలిచినా అందరికీ గుర్తొచ్చేది అల్లు అర్జున్ పేరు. మెల్లిమెల్లిగా దక్షిణాదిపై గ్రిప్ తెచ్చుకున్న బన్నీ.. ఇప్పుడు ప్యాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అందులో భాగంగానే 'పుష్ప'ను జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి ప్యాన్ ఇండియన్ స్టార్‌గా ముందడుగు వేయడంతో అందరూ సంబరపడుతున్నారు.
అయితే బన్నీ సత్తా ఏంటో అందరికీ తెలియజేయాలని ఫ్యాన్స్ ఉబలాటపడుతోన్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం నుంచి బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నానా హంగామా చేశారు. ఎలాంటి సందర్భం లేకపోయినా IndianStyleIconAlluArjun అనే హ్యాష్ ట్యాగ్‌తో బన్నీ సత్తా చాటాలని ఫ్యాన్స్ సందడి చేశారు. ఇరవై నాలుగు గంటల పాటు ట్విట్టర్లో యుద్దం చేశారు.

బర్త్ డే, అడ్వాన్స్ బర్త్ డే, కామన్ డీపీ ఇలాంటి ప్రత్యేక సందర్భాలు కాకపోయినా.. అత్యధిక ట్వీట్లు సాధించిన హ్యాష్ ట్యాగ్‌గా IndianStyleIconAlluArjun రికార్డు క్రియేట్ చైసింది. అసందర్భంగా ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్‌లో ఇది కేవలం 24 గంటల్లో కోటీ ట్వీట్లను సొంతం చేసుకుంది. ఇది కూడా ఓ ప్రత్యేకమైన రికార్డ్. మొత్తానికి బన్నీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఆధిపత్యం కోసం భారీగానే పోరాడారు. దీన్ని బట్టే బన్నీ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











