అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీరంగం.. బన్నీ ఫ్యాన్స్ చితకబాదిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్‌లో ఫ్యాన్స్ వీరంగం గత కొద్ది రోజులుగా సినీ తారలకు తలవంపులు తెచ్చిపెట్టేలా మారడం సినీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నది. తెలుగు సినిమా స్టార్ హీరోల ఫ్యాన్స్ గత వారం రోజుల్లో మూడుసార్లు నానా రచ్చ చేయడం ఎస్ఎస్ రాజమౌళి లాంటి దర్శకుడు సారీ చెప్పేలా చేసింది. తాజాగా హైదరాబాద్‌లోని ఎన్ కన్వెషన్ సెంటర్ వద్ద స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల వీరంగం తాజాగా చర్చనీయాంశమైంది. ఈ వివరాల్లోకి వెళితే..

గతవారం RRR మీట్ క్యాన్సిల్
గతవారం అంటే గురువారం ( డిసెంబర్ 9వ తేదీన) ఎస్ఎస్ రాజమౌళి అండ్ RRR టీమ్ మీడియాతో మాట్లాడేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అభిమానులకు పాస్‌లు పంచి పెట్టిన నిర్వాకంతో గందరగోళం నెలకొన్నది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ అభిమానులు భారీగా బంజారా హిల్స్‌లోని సినీ మాల్ వద్దకు రావడంతో గందరగోళం నెలకొన్నది. దాంతో మీడియా సమావేశాన్ని రద్దు చేసే వరకు వెళ్లింది.

యంగ్ టైగర్, మెగాపవర్ స్టార్ అభిమానుల రచ్చ
ఇక RRR మీడియా సమావేశం వద్దకు యంగ్ టైగర్, మెగాపవర్ స్టార్ అభిమానులు చేసిన గొడవ కారణంగా పలువురికి గాయాలు అయ్యాయి. ఆ సినీ మాల్‌లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.. అలాగే అభిమానులను కంట్రోల్ చేయడం బౌన్సర్ల వల్ల కాలేదు. ఈ సందర్భంగా అభిమానుల వ్యవహారం చర్చనీయాంశమైంది.

పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ ఫ్యాన్స్ నిర్వాకం
ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో జరిగింది. అయితే మోతాదుకు మించి పాసులు జారీ చేయడంతో పరిమితికి మించి గ్రౌండ్‌లో అభిమానులు, ప్రేక్షకుల రావడంతో తొక్కిసలాట జరిగింది. దాంతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.

ఎన్‌కన్వెన్షన్ గేట్ విరగకొట్టిన ఫ్యాన్స్
అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య అల్లు అర్జున్ తన అభిమానులతో సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు N కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యాన్స్‌తో ఫోటో సెషన్ నిర్వహించారు. అయితే అభిమానులు భారీగా పోటెత్తడంతో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఓ దశలో పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టారు. దాంతో భారీగా తోపులాట జరగడంతో బన్నీ ఫ్యాన్స్ కన్వెన్షన్ సెంటర్ గేట్‌ను విరుగకొట్టారు. అభిమానులు హద్దు మీరడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Recommended Video

ఫ్యాన్స్ మీట్ రద్దు చేసుకొన్న అల్లు అర్జున్
ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఫ్యాన్స్ చెల్లచెదురు కావడం, భారీగా తోపులాట చోటు చేసుకోవడంతో ఫ్యాన్స్‌తో ఫోటో సెషన్‌ను అల్లు అర్జున్ రద్దు చేసుకొన్నారు. పోలీసుల లాఠీఛార్జీ కారణంగా పలువురు అభిమానులు గాయాలపాలయ్యారు. దాంతో ఫ్యాన్స్‌తో బన్నీ మీట్ రసాభాసగా ముగిసింది. ఇలా అభిమానుల కార్యక్రమం గందరగోళం కావడంపై అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











