Ram Charan Vs Allu Arjun Fan War: రాంచరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్ వార్.. దమ్ముంటే పుష్పను కొట్టండిరా అంటూ సవాల్
Ram Charan Vs Allu Arjun Fan War: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన పొలిటికల్ త్రిల్లర్
'గేమ్ ఛేంజర్'( Game Changer). ఈ సినిమాకు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మించారు. సంక్రాంతి కానుకగా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ కు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సమయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టేలా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సవాల్ విసురుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లూక్కేయండి.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRRతో రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో స్టార్ హీరో నుంచి గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్. ఈ తరుణంలో రామ్ చరణ్ - శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ తెరకెక్కింది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో సారి తన నటవిశ్వ రూపాన్ని చూపించారట. ఇందులో చరణ్ డూయల్ రోల్ నటించగా.. అంజలి, కియారా అడ్వాణీ హీరోయిన్లుగా నటించారు. ఇక సీరియర్ హీరో శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, ఎస్.జె. సూర్య తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. దాదాపు రెండేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా రావడం, శంకర్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు చాలా ఉన్నాయి. అయితే.. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా రావడంతో హిట్ కొట్టగలదా? లేదా? అనే వేచి చూడాలి.

ఇదిలాఉంటే.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అల్లు Vs మెగా ఫ్యాన్స్ వార్ గట్టిగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప 2 డిసెంబర్ 5 న విడుదలై.. బాక్సాఫీస్ ను షేక్స్ చేసింది. ఎవరు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది అల్లు అర్జున్ పుష్ప 2. ఇటు సౌత్ ఇండియాలోనూ.. అటు నార్త్ ఇండియాలను కలెక్షన్లలో పాన్ ఇండియా సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటివరకు ఉన్న బాహుబలి 2 పేరు మీద ఉన్న అత్యధికంగా కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా రికార్డును అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బ్రేక్ చేసింది.
అటు హిందీలోని కూడా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో పుష్ప 2 ఒకటిగా నిలిచింది. ఇలా ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తమ హీరోను బీట్ చేసే హీరో ఎవరు లేదంటూ కామెంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కేవలం నేషనల్ ఫేమ్ కాదు.. వరల్డ్ వైడ్ ఫేమస్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. మరోసారి జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకుంటాడంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందులో అల్లు అర్జున్ వీరాభిమాని.. ఏకంగా గేమ్ చేంజర్ నడుస్తున్న థియేటర్లకు వచ్చి రామ్ చరణ్ ఫాన్స్ కు అటు మెగా ఫ్యాన్స్ కు వార్నింగ్ చేస్తున్నాడు. తమ హీరో రికార్డ్స్ బ్రేక్ చేసే సత్తా ఉందా అంటూ సవాల్ విసురుతూ ఉన్నాడు. ఈ వీడియో కావడంతో తమ హీరోకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలుస్తూ అల్లు అర్జున్ రికార్డ్స్ బ్రేక్ చేస్తామంటూ బదులిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎన్నో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెస్పాన్స్ వీడియోస్ ప్రత్యక్షమవుతున్నాయి. ఏది ఏమైనా సినిమాను సినిమా గానే చూడాలి. హీరోలను హీరోలు గాని చూడాలని మరికొందరు నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అవి వీడియో ఏంటో మీరు కూడా ఓ లుక్కేయండి..


Click it and Unblock the Notifications











