Allu Arjun: థియేటర్స్ లో ఏకంగా టపాసులతో బ్లాస్ట్.. బన్నీ ఫ్యాన్స్ కు ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
ఈ మధ్య కొత్త కొత్త సినిమాలే కాకుండా పాత సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. స్టార్ హీరోల పుట్టిన రోజులు, 20, 25 ఏళ్ల పూర్తి చేసుకున్న సినిమాలను మరోసారి రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ గా మారిపోయింది. ఇప్పటి వరకు ఇలా చాలా మంది సినిమాలు రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా వారి చిత్రాలను విడుదల చేశారు. అయితే అంతా బాగానే ఉన్నా థియేటర్స్ లో కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఎలాంటి ఘటనలు జరుగుతాయో అనే భయం కలుగుతోంది. ఇక మరోసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఒక అదే తరహాలో అతిగా చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ట్విస్ట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
శృతి మించడంతో..: ఎన్నో ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరోల సినిమాలు థియేటర్లలో ప్రదర్శించడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే ఒక్కోసారి శృతి మించడంతో ఊహించని ప్రమాదాలు కూడా ఎదురవుతున్నాయి. సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ విపరీతమైన రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాణాసంచాలు కాల్చడం, పాలాభిషేకం చేయడం, సీట్ కవర్లు చించడం, స్క్రీన్ ను డ్యామేజ్ చేయడం, అక్కడ ఉన్న ఫర్నీచర్ ను ధ్వంసం చేయడం మనకు తెలిసిందే.

రక్తంతో బొట్లు పెట్టడం : అంతేకాకుండా కొంతమంది అభిమానులు అయితే హద్దులు దాటి మరి ప్రవర్తిస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొందరు అయితే కత్తితో చేతులను కోసుకొని వెండితెరకు బొట్లు కూడా పెడుతున్నారు. ఈ తరహా ఘటనలు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలాసార్లు వైరల్ అయ్యాయి. స్టార్స్ అలాగే సెలబ్రిటీలు చాలామంది అభిమానులు ఇలాంటి పనులు చేయొద్దు అని ఎంత చెప్పినప్పటికీ కూడా అవి ఏ మాత్రం తగ్గడం లేదు.

బన్నీ ఫ్యాన్స్ అత్యుత్సాహం : ఇలాంటి ఘటనలతో థియేటర్ల యజమానులు రీ రిలీజ్ లు అంటేనే భయపడిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఏప్రిల్ 8వ తేదీవ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ క్రమంలోనే ఆయన హీరోగా చేసిన దేశముదురు సినిమాను రీ రిలీజ్ చేశారు చిత్ర బృందం. అయితే అత్యుత్సాహం చూపిన బన్నీ ఫ్యాన్స్.. హైదరాబాద్లోని ఓ థియేటర్ లో షో రన్ అవుతుండగానే... టపాసులు పేల్చారు.
ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు : ఫ్యాన్స్ గోల గోలగా రచ్చ రచ్చ చేశారు. విషయం గుర్తించిన థియేటర్ నిర్వాహకులు, యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు షోను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో కొంతమంది అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది చేసిన తప్పు వల్ల సినిమాను ఆపేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారట.

జరిగింది ఎక్కడంటే : అయితే ఈ వీడియోను షేర్ చేస్తూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కెఎన్ ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ అభిమానుల అత్యుత్సాహంతో థియేటర్ లోకి పోలీసులు రావాల్సి వచ్చిందని, షోను కూడా అపేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. దయచేసి ఎవరూ థియేటర్లను కానీ అందులోని సామాగ్రిని కాని ధ్వంసం చేయొద్దని సూచించారు.


Click it and Unblock the Notifications











