Mega Vs Allu: పుష్ప 2 రిలీజ్ ముందు కొత్త వివాదం..

తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిగ్ స్టార్ హీరోస్ లో వారి అభిమానుల్లో ఎప్పుడూ కూడా ఫ్యాన్ వార్స్ అనేవి సర్వ సాధారణంగానే ఉంటాయి. కానీ ఇపుడు పరిస్థితులు ఒక కుటుంబానికి చెందిన హీరోల అభిమానుల నడుమే చీలిక ఏర్పడింది. అయితే గతంలో ఇలా నందమూరి హీరోలు బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ నడుమ ఉండేది అని టాక్ ఉంది. కానీ ఇపుడు మెగా కుటుంబంలో ఈ చీలిక కనిపించడం మరింతమంది దృష్టిని ఆకర్షించింది.

కాగా ఎంత లేదు అనుకున్నా కూడా మెగాస్టార్ చిరంజీవి అనే మహా వృక్షం నుంచే ఏ హీరో అయినా వచ్చారు. తన నీడలోనే మేము వచ్చామని మెగా యంగ్ హీరోలు అంతా చెప్పుకున్నారు. కానీ ఇపుడు తమ సొంత స్టేటస్ వచ్చాక మెగా బ్రాండ్ వద్దు అనుకుంటున్నారా అంటూ చర్చ అభిమానుల్లో మొదలైంది. కాగా ఇదంతా మెగా అండ్ అల్లు అర్జున్ అభిమానుల కోసమే అని చెప్పాలి.

allu arjun fans triggering mega fans and making this more difficult quarrels

మరి గత కొన్నాళ్ల నుంచి మెగా వర్సెస్ అల్లు అర్జున్ నడుమ గొడవలు పతాక స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా అల్లు అర్జున్ చేసిన కొన్ని చర్యలు మెగా అభిమానులని బాగా హర్ట్ చేసాయి. దీనితో అక్కడ నుంచి మొదలైన గొడవ ఇపుడు ఫ్యాన్స్ నడుమ ఏదో సీరియస్ టర్న్ తీసుకునేలా ఉందని అనిపిస్తుంది.

కాగా అల్లు అర్జున్ శిల్ప రవికి సపోర్ట్ చేసిన తర్వాత పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇతర మెగా అభిమానులు అంతెందుకు కొంతమంది మెగా యువ హీరోలు కూడా నొచ్చుకున్నారనేది వాస్తవం. సరే ఇది పక్కన పెడితే మళ్ళీ అల్లు అర్జున్ ఓ ఈవెంట్ చేసిన కామెంట్స్ ట్రిగ్గర్ చేసాయి. ఇపుడు దీనికి పై పెచ్చు బన్నీ ఫ్యాన్స్ ఆఫ్ లైన్ లో పలు ఫ్లెక్స్ లు వాటిలో కామెంట్స్ మెగా అభిమానుల్లో సీరియస్ గా మారాయి.

పవన్ ని టార్గెట్ చేస్తూ గమ్ము 'గుండు' అంటూ ఏం పీకలేరు బ్రదర్ అంటూ ఫ్లెక్స్ లను ఆఫ్ లైన్ లో పెట్టడం ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడం యిట్టె జరిగింది. అయితే ఈ ఫ్లెక్స్ లో కొన్ని కామెంట్స్ అనేవి ఇప్పుడు నుంచే కాదు ఎప్పుడు నుంచో ఉన్నాయి. ఓ హీరో ఫ్యాన్స్ మరో హీరోకి కౌంటర్ ఇస్తూ చేసినవి అలా వైరల్ అయ్యేవి కానీ ఇప్పుడు మాత్రం మెగా అండ్ పవన్ ఫ్యాన్స్ దీనిని చాలా సీరియస్ గా తీసుకున్నారు.

allu arjun fans triggering mega fans and making this more difficult quarrels

ఇవే ఫ్లెక్స్ లు గాని పుష్ప 2 రిలీజ్ రోజు థియేటర్స్ దగ్గర కనిపిస్తే బన్నీ ఫ్యాన్స్ తో ఖచ్చితంగా అక్కడే గొడవలు ఉంటాయని అంటున్నారు. అలాగే ఎవరికీ తెలీకుండా పెట్టడం కాదు దమ్ముంటే ఎక్కడెక్కడ పెడుతున్నారో ఆ థియేటర్స్ పేర్లు కూడా మెన్షన్ చెయ్యాలని పవన్ అండ్ మెగా అభిమానులు అంటున్నారు. దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పెట్టి తీరుతాం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వాళ్ళూ తగ్గడం లేదు.

దీనితో ఇపుడు వీరి వివాదం ఆన్లైన్ నుంచి ఆఫ్ లైన్ లో పెద్ద గొడవలు వైపే వెళ్లేలా కనిపిస్తుంది అని చెప్పాలి. ఒకవేళ పవన్ లేదా చిరంజీవిని లేదా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పుష్ప 2 రిలీజ్ రోజు థియేటర్స్ దగ్గర అలాంటి ఫ్లెక్స్ లు దర్శనమిస్తే పెద్ద గొడవలే జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ కాంట్రవర్సీ హీరోల్లో ఆగినా అభిమానుల్లో మాత్రం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. పైగా ఇది మరింత తీవ్ర రూపం దాల్చేలా కనిపిస్తుంది.

More from Filmibeat

Read more about: pushpa 2 allu arjun chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X