ఆ విషయంలో...సౌత్ నెం.1 హీరో అల్లు అర్జునే!
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ విషయంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 2.5 మిలియన్లు (25 లక్షలు) క్రాస్ అయింది. ఇప్పటి వరకు ఏ సౌత్ హీరోకు కూడా ఫేస్‌బుక్‌లో ఈ రేంజిలో ఫాలోయింగ్ లేక పోవడం గమనార్హం.
అక్టోబర్ నెల వరకు గమనిస్తే....అప్పటికి అల్లు అర్జున్‌ను ఫేస్ బుక్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్యల 1 మిలియన్ మాత్రమే. అయితే రెండు నెలలు గడిచేలోపే....ఈ సంఖ్య 2.5 మిలియన్లకు చేరడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు కేరళ, కర్నాట, తమిళనాడు రాష్ట్రాల్లోనూ అల్లు అర్జున్‌ను అభిమానులు ఉన్నారు.
తెలుగు సినిమా పరిశ్రమ వరకు పరిశీలిస్తే....ఇంతకు ముందు ఈ విషయంలో మహేష్ బాబు నెం.1 స్థానంలో ఉండే వాడు. ఇప్పుడు అల్లు అర్జున్ మహేష్ బాబును దాటి పోయాడు. మరో వైపు మహేష్ బాబుతో పోటీ పడుతూ పలు కార్పొరేట్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు అల్లు అర్జున్.
ప్రస్తుతం అల్లు అర్జున్ 'రేస్ గుర్రం' చిత్రంలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications












