'అల.. వైకుంఠపురములో' సక్సెస్ మీట్: పూజా ఆ మాట అనగానే అల్లు అర్జున్ ఫీలింగ్స్
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' మూవీ ఇటీవలే విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు చిత్రయూనిట్ అంత హాజరయ్యారు.

అలరించిన పూజా, శ్రీముఖి యాంకరింగ్
శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ విజయోత్సవంలో స్టేజీపై హుషారుగా పాటలు పాడారు సింగర్స్. అల్లు అర్జున్ సినిమాల్లోని పాటలు, డాన్సర్ల పర్ఫార్మెన్సులు అమితంగా అలరించాయి. హీరోయిన్ పూజా హెగ్డే 'సామజవరగమన' పాటలోని "నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి నా కళ్లు.. నా చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు" అనే లైన్ పాడి అలరించింది.

అల్లు అరవింద్ కౌగలించుకోవడం..
హీరో డైరెక్టర్లు అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఒకేసారి వేదిక వద్దకు రావడంతో ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. ‘సిత్తరాల సిరపడు' పాటను ఆలపించిన గాయకుడు సూరన్నను స్టేజిపైకి వచ్చి అల్లు అరవింద్ కౌగలించుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

పూజా హెగ్డే స్పీచ్.. బన్నీ ఫీలింగ్స్
‘ఓ మై గాడ్ డాడీ' పాటకు ప్రఖ్యాత సంగీతకారుడు డ్రమ్స్ శివమణి పర్ఫార్మెన్స్ ఇవ్వగా, రోల్ రైడా బృందం ఆ పాటను ఆలపించింది. హీరోయిన్ పూజా హెగ్డే "వైజాగ్ సార్.. వైజాగ్ అంతే" అంటూ తన స్పీచ్‌ను మొదలుపెట్టడంతో కింద కుర్చీలో కూర్చున్న బన్నీ 'వ్వావ్' అంటూ గట్టిగా నవ్వేశారు.

బన్నీ తెచ్చిన కోటును థమన్.. సూరన్న పాట
సూరన్న కోసం బన్నీ తెచ్చిన కోటును థమన్ స్వయంగా ఆయనకు తొడగగా, తనకు ఈ సినిమాలో పాడే అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్‌కు, తమన్‌కు థాంక్స్ చెప్పి మరో గాయకుడు సాకేత్‌తో కలిసి 'సిత్తరాల సిరపడు' పాటను ఆలపించారు సూరన్న.

డ్రమ్మర్ శివమణి పర్ఫార్మెన్స్
డ్రమ్మర్ శివమణి ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఆహూతులను మెస్మరైజ్ చేసింది.సూట్ కేసు, వాటర్ క్యాన్ వంటి వస్తువులపై కూడా స్వరాలు పలికించడమే కాకుండా అరవింద్, త్రివిక్రమ్, పూజా హెగ్డేల చేత కూడా డ్రమ్స్‌పై స్వరాలు పలికింపజేశారు శివమణి. కిందికి వెళ్లి మరీ బన్నీని స్టేజిపైకి తీసుకు వచ్చారు. అలాగే బన్నీ పూజతో కలిసి 'రాములో రాములా' సాంగ్ సిగ్నేచర్ స్టెప్ వేసి అలరించారు.


Click it and Unblock the Notifications











