అల్లు అర్జున్ కొత్త సినిమాలో విలన్ అతనే...!?
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం నవంబర్ 2,2011న ప్రారంభమైన విషయం విధితమే. రామానాయుడు స్టూడియోలో ఘనంగా ఈ లాంచింగ్ చేసినారు. ఎన్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ గా మొదట సుదీప్ ని అనకున్నా ఫైనల్ గా సోనూ సూద్ నే ఎంపిక చేసారు. అలాగే తనకు అన్ని రెగ్యులర్ పాత్రలే వస్తున్నాయని, అందుకే కొత్తగా సినిమాలు ఒప్పుకోలేదని చెప్తున్న సోనూసూద్ ఈ పాత్ర ను ఓకే చేయటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
అయితే మొదట ఓకే చేసిన సుదీప్ ఎందుకు రిజెక్టు చేసాడో మాత్రం తెలియరాలేదు. ఇక నవంబర్ 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇలియానా కూడా ఆ రోజునుంచి షూటింగ్ లో పాల్గొంటుంది. శక్తి చిత్రం విడుదలైన దగ్గరనుంచి కనపడకుండా పోయిన ఇలియానా ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇవ్వనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ జల్సా చిత్రానికి సంగీతం అందించారు. అలాగే అల్లు అర్జున్ గత చిత్రాలకు దేవి సంగీతం బాగా ప్లస్ అయిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. దీనికోసం ఇటీవల ముంబయిలోని హకీమ్స్ అలీమ్ అనే సెలూన్‌లో కొత్త రకం హెయిర్ స్టయిల్ చేయించుకున్నారు. ఈ లుక్ చాలా చాలా బాగుందని అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ అంటున్నారు. నాకైతే ఇప్పుడే అన్నయ్య ఫొటో విడుదల చేయాలని ఉంది. కానీ నా బ్రదర్ మాత్రం ఒకేసారి ఫస్ట్ లుక్ విడుదల చేద్దామంటున్నాడు. పోస్టర్‌లో డెరైక్ట్‌గా చూస్తేనే ప్రభావం ఉంటుందని తన అభిప్రాయం అని అల్లు శిరీష్ ట్విట్టర్‌లో పెట్టారు.
ఇతర ముఖ్యపాత్రల్లో రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తణికెళ్ల భరిణి, ఎమ్ ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, బ్రహ్మాజి, రావు రమేష్, ప్రగతి, తులసి, హేమ తదితరులు నటించనున్నారు. అరవీందర్ ఆర్ట్ దర్శకత్వం,పీటర్ హెయిన్స్ ఫైట్స్ అందిస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











