గూండాల పని పడుతున్న అల్లు అర్జున్

By Srikanya

హైదరాబాద్: అల్లు అర్జున్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రేస్ గుర్రం'. ఇటీవలే ఏక్‌దోతీన్‌ అంటూ మాంచి ఫాస్ట్‌బీట్‌కి చిందేసిన అల్లు అర్జున్‌ ఇప్పుడు గూండాల పని పడుతున్నాడు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'రేసుగుర్రం' షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో సలోని మరో హీరోయిన్ గా చేస్తోంది. నల్లమలపు బుజ్జి, డా.వెంకటేశ్వరరావు నిర్మాతలు. సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అల్లు అర్జున్‌, ఫైటర్లపై పోరాట సన్నివేశాల్ని చిత్రిస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ''వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుగా వస్తోన్న చిత్రమిది. అల్లు అర్జున్‌ నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల అంశాలు సినిమాలో ఉంటాయి. అల్లు అర్జున్‌ అంటేనే హుషారు. పాటలకు ఆయన ఆట స్పీడు. ఫైట్లు చేసేటప్పుడు ఆయన కదలికలు యమా స్పీడు. మొత్తంగా నటనలోనూ వైవిధ్యం కోసం చూపిస్తుంటారు.'' అన్నారు.

'రేసుగుర్రం' చిత్రం టైటిల్ బన్నికి తగిన విధంగా ఉందని టాలీవుడ్‌లో చెబుతున్నారు. ఈ చిత్ర కథా కథనాలు అన్నీ అతని ఇమేజ్‌కు తగిన విధంగా డిజైన్ చేశారని, ఇప్పటివరకూ బన్నీని చూడని గెటప్‌లో చూపించనున్నారని తెలుస్తోంది. కథానాయికగా శృతిహాసన్ తొలిసారిగా బన్నీ సరసన చేస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి తన మార్కు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందిస్తున్నారని, అందరూ అగ్ర నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను త్వరలో పలకరించనుంది. తమన్‌ స్వరాలందిస్తున్నారు.

ఈ చిత్రంలో విలన్ గా...భోజపురి హీరో రవి కిషన్ చేస్తున్నారు. రవికిషన్ ఈ చిత్రంలో శివారెడ్డి అనే పాత్రను పోషిస్తున్నారు. అతని పాత్ర ఓ రాజకీయనాయకుడుది అని తెలిస్తోంది. వీరిద్దరి మధ్య ఇప్పటికే పలు సీన్లు కూడా చిత్రీకరించారు. ఈ చిత్రం విడుదల అయ్యాక తెలుగులోనూ పూర్తి బిజీ అవుతాననే నమ్మకంగా ఉన్నారు రవి కిషన్.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X