అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం ఈ రోజు (నవంబర్ 2,2011)న ప్రారంభమైంది.రామానాయుడు స్టూడియోలో ఘనంగా ఈ లాంచింగ్ ని నిర్మాతలు జరిపారు. ఎన్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య సమర్పిస్తున్నారు. అల్లు అర్జున్ పై ముహూర్తపు షాట్ తియ్యటంపై ఈ చిత్రం ప్రారంభమైంది.రాజమౌళి క్లాప్ ఇవ్వగా వివి వినాయిక్ స్విచ్ ఆన్ చేసారు.కె రాఘవేంద్రరావు మొదటి షాట్ కి దర్శకత్వం వహించారు. నవంబర్ 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. బాలీవుడ్ కెమెరామెన్ అమోల్ రాఘోడ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ భాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియానా నటించనుంది.మిగతా ముఖ్యపాత్రల్లో రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తణికెళ్ల భరిణి, ఎమ్ ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, సోనూ సూద్, బ్రహ్మాజి, రావు రమేష్, ప్రగతి, తులసి, హేమ తదితరులు నటించనున్నారు. అలాగే సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించనున్నారు. రవీందర్ ఆర్ట్ దర్శకత్వం,పీటర్ హెయిన్స్ ఫైట్స్ అందిస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











