twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టైలిష్ దర్శకుడుతో అల్లు అర్జున్ నెక్స్ట్ ఖరారు

    By Srikanya
    |

    రీసెంట్ గా ఊసరవెల్లి చిత్రంతో పలకరించిన స్టైలిష్ దర్శకుడు సురేంద్రరెడ్డి తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయబోతున్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం చిత్రీకరణ మొదలు కానుందని చెప్తున్నారు. ఇక గత కొంతకాలంగా భుజానికి ఆపరేషన్ చేయించుకున్న అల్లుఅర్జున్ వరస చిత్రాలతో బిజీ కానున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన చేయబోయే సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. దీనికోసం ఇటీవల ముంబయిలోని హకీమ్స్ అలీమ్ అనే సెలూన్‌లో కొత్త రకం హెయిర్ స్టయిల్ చేయించుకున్నారు. ఈ లుక్ చాలా చాలా బాగుందని అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ అంటున్నారు. నాకైతే ఇప్పుడే అన్నయ్య ఫొటో విడుదల చేయాలని ఉంది.

    కానీ నా బ్రదర్ మాత్రం ఒకేసారి ఫస్ట్ లుక్ విడుదల చేద్దామంటున్నాడు. పోస్టర్‌లో డెరైక్ట్‌గా చూస్తేనే ప్రభావం ఉంటుందని తన అభిప్రాయం అని అల్లు శిరీష్ ట్విట్టర్‌లో పెట్టారు. ఇక అల్లు అర్జున్, వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందించిన బద్రీనాధ్ చిత్రం భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ ఫలితాన్ని మోసుకు వచ్చింది.అలాగే సురేంద్రరెడ్డి ఊసరవెల్లి కూడా అనుకున్నంత విజయం సాధించలేదు.ఆర్.ఆర్.మూవీ మేకర్స్ విడుదల చేసిన ఊసరవెల్లి కి కలెక్షన్స్ విషయంలోనూ బాగా స్లో అయ్యిపోయింది.ఆర్.ఆర్.మూవీమేకర్స్ వారు ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఢమరకం చిత్రాన్ని,పూరీ దర్శకత్వంలో ది బిజినెస్ మ్యాన్,వీరభద్ర చౌదరి దర్సకత్వంలో సునీల్ హీరోగా పూలరంగడు చిత్రాలు నిర్మిస్తున్నారు.

    English summary
    Allu Arjun is set to act in a new film in the direction of Surender Reddy. As per the sources buzz, Surender Reddy has recently narrated a story to Allu Arjun and the actor, who is impressed with the script has immediately given his nod for the director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X