జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్యార్లల్ గా రెండు సినిమాలు...!?
'బద్రినాథ్" లాంటి సక్సెస్ తరువాత్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే చిత్రం ఏమై ఉంటుందని అభిమానుల నుంచి సామాన్య ప్రేక్షకుడి వరకూ ఓ టాపిక్ గా మారింది. గతంలో 'బన్నీ' చిత్రీకరణలో చేతికి గాయమైన అల్లు అర్జున్ ఈ మధ్య ఆస్ట్రేలియాలో ఆ గాయానికి సర్జరీ కూడా చేయించుకొచ్చిన విషయం విధితమే. ఎట్టకేలకు సర్జరీ చేయించుకుని, ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్న బన్నీ తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. అయితే, అల్లు అర్జున్ ఇప్పుడు ఏ సినిమా చేయబోతున్నాడనేది సస్పెన్స్ గా మారింది.
త్రివక్రమ్ డైరెక్షన్ లో బన్నీ ఓ సినిమా చేస్తాడనే ప్రచారం జరిగినా, త్రివిక్రమ్ ప్లేస్ లోకి వాసు వర్మ సినిమా వచ్చి చేరింది. అక్కినేని నాగచైతన్య తో సూపర్ ఫ్లాప్ 'జోష్" సినిమా రూపొందించిన వాసువర్మ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మించబోయే సినిమా త్వరలో సెట్స్ పైకి రానుందని సమాచారం.
మరి త్రివిక్రమ్ సినిమా సంగతేంటనే ప్రశ్నకు అది కూడా పేరలల్ గా షూటింగ్ జరుపుకుంటుందని మెగా క్యాంప్ నుంచి న్యూస్ అందుతోంది. ఒకవైపు ప్రేమకథా చిత్రాలు... మరోవైపు యాక్షన్ సినిమాలు చేస్తూ.. తనలోని భిన్న పార్శ్వాలను నిరూపించుకుంటున్నారు అల్లు అర్జున్. పంచ్ డైలాగ్ లు చెప్పటంలో బన్నీకి ఓ స్టైల్ వుంది. పంచ్ డైలాగులు అందించడంతో పాటు, తనలో మంచి దర్శకుడు కూడా ఉన్న విషయాన్ని నిరూపించుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. అటువంటి వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రాన్నికూడా ప్యార్లల్ గా నటించిడానికి మంచి సరికొత్త ఉత్సాహంతో అల్లు అర్జున్ ఉన్నట్టు సన్నిహితుల నుండి అందిన సమాచారం.
తదుపరి చేయబోయే సినిమా సంగతెలా వున్నా ఇతరాత్రా వ్యాపకాలతో బన్నీ చాలా బిజీగా ఉన్నాడని సమాచారం. మునపటితో పోల్చితే కొత్త గ్లామర్ తో మంచి జోష్ మీదున్నట్టు కన్పిస్తున్నాడు అల్లుఅర్జున్..


Click it and Unblock the Notifications











