Pushpa 2: అమ్మవారి గెటప్పుతో అల్లు అర్జున్.. పుష్ప 2 ఫస్ట్ లుక్ అరాచకం సామీ!

గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తర్వాతి కాలంలో వరుస సినిమా హిట్స్ ఇచ్చాడు. తన డ్యాన్స్, యాక్టింగ్ స్టైల్ తో అశేషమైన అభిమానులను సంపాదించుకుని స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప 2తో అలరించనున్నాడు. అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్స్ తో పూనకాలు తెప్పించే ట్రీట్ ఇస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. ఇప్పటికే పుష్ప 2 టీజర్ తో హైప్ పేంచేయగా తాజాగా బన్నీకి చెప్పిన బర్త్ డే విషెస్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో మరో స్థాయికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న బన్నీ ఫస్ట్ లుక్ పై ఓ లుక్కేస్తే..

పుట్టిన రోజు సందర్భంగా: అల్లు అర్జున్ అభిమానులకు వరుసగా అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. దీంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 నుంచి అప్డేట్స్ ఇస్తామని ఏప్రిల్ 5న ప్రకటించి ఊరించారు. అందుకు తగినట్లుగానే ఇవాళ అంటే ఏప్రిల్ 7న సాయంత్ర 4.05 నిమిషాలకు 'పుష్ప: ది రూల్' మూవీ టీజర్ ను The HUNT before the RULE టైటిల్ తో బయటకు వదిలారు.

Allu Arjun First Look From Pushpa 2 Released Over His Birthday

2 గంటల్లో 20 లక్షల వ్యూస్: తాజాగా సోషల్ మీడియాలో వదిలిన అల్లు అర్జున్ పుష్ప 2 టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప 2 టీజర్ ట్రెండ్ అవుతోంది. 2 గంటల్లో 20 లక్షల వ్యూస్, 3 లక్షల లైక్స్ సాధించి దూసుకుపోతోంది. త్వరలో రికార్డ్ చేసేలా ఉంది ఈ టీజర్. ఇక ఈ టీజర్ ను అదిరిపోయే సన్నివేశాలతో సినిమాలో ఫుల్ మీల్స్ ఇస్తున్నట్లుగా హింట్ ఇచ్చేశారు.

హోరెత్తించే సీన్స్: పుష్ప 2 టీజర్ లో తిరుపతి జైలు నుంచి 8 బుల్లెట్టు గాయాలతో తప్పించుకున్న పుష్ప కోసం పోలీసులు వెతకటం, పుష్ప మద్దతుదారులు నిరసనలు, అల్లర్లు, 144 సెక్షన్, పుష్ప గొప్పతనం గురించి ప్రజలు మీడియాకు చెప్పడం, పోలీసులే పుష్పను ఎన్ కౌంటర్ చేశారని వార్తల్లో రావడం, అడవిలో పుష్ప షర్ట్ రక్తపు మడుగులో దొరకడం, పులుల కోసం ఏర్పాటు చేసిన కెమెరాల్లో పుష్ప కనిపించే సీన్లతో హోరెత్తించారు.

Allu Arjun First Look From Pushpa 2 Released Over His Birthday

రిపోర్టర్ గా బిగ్ బాస్ దివి: ఇక టీజర్ లో అల్లు అర్జున్ ను చూసి పులి రెండు అడుగులు వెనక్కి వేస్తూ చిత్రీకరించిన సీన్ హీరోయిజానికి హై ఎలివేషన్ లా ఉంది. ఇక "అడవి జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం" అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇందులో సిటీ న్యూస్ రిపోర్టర్ గా బిగ్ బాస్ దివి కనిపించి సందడి చేసింది.

కాళీ అవతారంలో బన్నీ: పుష్ప 2 టీజర్ మత్తు నుంచి తేరుకునేలోపే నిర్మాతలు మరో ఫొటోను రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు. పుష్ప 2లో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ గా చెబుతూ బన్నీకి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ పోస్టర్ లో బన్నీ అమ్మవారి అవతారంలో చేతిలో గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్న ఆ పిక్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. అయితే ఈ ఫస్ట్ లుక్ అధికారికంగా ముందే నెట్టింట్లో లీక్ కావడంతో.. వెంటనే నిర్మాణ సంస్థ రియాక్ట్ అయి అఫిషియల్ గా రిలీజ్ చేసింది. ఏమైనా గానీ బన్నీ ఫ్యాన్స్ కు మాత్రం ఒకదాని తర్వాత మరొకటిలా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు మైత్రీ మూవీ మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X