Allu Arjun: ' ఇప్పుడేం మాట్లాడలేను' అల్లు అర్జున్ ఎమోషనల్..
Allu Arjun: ఎన్నో ట్విస్టులు, మలుపుల తరువాత హైదరాబాదులోని చంచలగూడ జైలు నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల అయ్యారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల మేరకు శనివారం తెల్లవారుజామున అల్లు అర్జున్ ను అధికారులు విడుదల చేశారు. విడుదలైన తరువాత గీత ఆర్ట్స్ ఆఫీస్ కు చేరుకున్నారు. అనంతరం అల్లు అర్జున్ ..తన జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి చేరుకుంటారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ.. తనను అభిమానించిన, సపోర్టు గా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. తాను బాగానే ఉన్నానన్నాని తెలిపారు. చట్టం అంటే తనకు గౌరవం అని, చట్ట ప్రకారమే తాను నడుచుకుంటాననీ పేర్కొన్నారు. పుష్ప 2 సినిమా ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన మృతురాలికి, బాధిత కుటుంబానికి తాను ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని, వారికి ఇప్పటికి కూడా అండగా ఉంటానని మరోసారి పేర్కొన్నారు. కానీ ఆనాడు జరిగిన ఘటన దురదృష్టకరమని, అనుకోకుండా ఆ దుర్ఘటన జరిగిందని పేర్కొన్నారు.

గత 20 సంవత్సరాలుగా తాను తన సినిమాల విడుదలైన తొలి రోజునాడు అభిమానులతో కలిసి సినిమాలు చూస్తూనే ఉన్నానని, కానీ, ఏ రోజు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. కానీ ఆరోజు జరిగిన ఘటనలో ఆమె చనిపోవడం బాధాకరమని, వారికి ఏమిచ్చిన వారి నష్టాన్ని పూర్తి చేయలేమని, నాకు సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి సహాయం చేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు.
అరెస్టు వెనుక ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించగా.. ప్రస్తుతం తాను ఆ కేసు గురించి మాట్లాడుకోదల్చుకోలేదని పేర్కొన్నారు. చట్టాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతానని, చట్టాన్ని నమ్ముతానని పేర్కొన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా
ధన్యవాదాలు తెలిపారు.

అల్లు అర్జున్ ఎమోషనల్
అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంటికి వెళ్లిన బన్నీ ని చూసి భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. భార్యా, బిడ్డలను ప్రేమగా హత్తుకొని ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జున్.


Click it and Unblock the Notifications











