బిగ్‌బాస్ 1,2 నేనే చేయాల్సింది.. కానీ ఎన్టీఆర్, నాని.. అది మాత్రం సీక్రెట్.. అల్లు అర్జున్!

Recommended Video

Allu Arjun Gives Clarity On Bigg boss Rumours || Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. బన్నీ చివరగా నా పేరు సూర్య చిత్రంలో నటించాడు. ఆ చిత్రం అభిమానులని నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో తెలుగు సినిమా మార్కెట్ పరిధి బాగా పెరుగుతోంది. చాలా మంది హీరోలు ఇతర చిత్ర పరిశ్రమల్లో కూడా మార్కెట్ పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాను కూడా అలంటి ప్రయత్నాలు మొదలుపెట్టానని అల్లు అర్జున్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు.

బిగ్‌బాస్ హోస్ట్‌గా

బిగ్‌బాస్ హోస్ట్‌గా

గత కొన్ని రోజులుగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ ఎవరనే విషయంపై చాలా ఆసక్తికర ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా నాగార్జున, వెంకటేష్ పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అల్లు అర్జున్ పేరు కూడా ప్రస్తావనకు వస్తోంది. తొలి రెండు సీజన్స్ కి ఎన్టీఆర్, నాని హోస్ట్ లుగా ఎంపికయ్యారు. త్వరలో ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే,.

 తొలి రెండు సీజన్లకు

తొలి రెండు సీజన్లకు

బిగ్ బాస్ సీజన్ 3కి తాను హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు వస్తున్న వార్తలపై బన్నీ స్పందించాడు. 'మా టివి' సంస్థ స్టార్ గ్రూప్ వశం కాకముందు మా నాన్న అల్లు అరవింద్ గారు అందులో భాగస్వామిగా ఉన్నారు. ఆ సమయంలో బిగ్ బాస్ తొలి రెండు సీజన్లకు హోస్ట్ ఉండమని ఓ అగ్రిమెంట్ తో నా వద్దకు వచ్చారు అని బన్నీ వివరించాడు. కానీ ఆ సమయంలో నేను ఖాళీగా లేను. వరుస చిత్రాలతో బిజీగా ఉండడం వలన ఆ ఆఫర్ వదిలేశానని బన్నీ తెలిపాడు. ఆ తర్వాత ఎంపికైన వాళ్ళు( ఎన్టీఆర్, నాని) చాలా బాగా చేశారని ప్రశంసించాడు. ప్రస్తుతం తనకు బిగ్ బాస్ చేసే తీరిక లేదని క్లారిటీ ఇచ్చాడు.

అది చాలా సీక్రెట్

అది చాలా సీక్రెట్

ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గురించి బన్నీ స్పందించాడు. ఈ చిత్రం తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో తెరకెక్కుతోందని వార్తలపై అల్లు అర్జున్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఈ చిత్రం గొప్ప ఎంటర్ టైనర్ అవుతుందని మాత్రం చెప్పగలను. కానీ కథ గురించి చిన్న విషయం కూడా బయట పెట్టను. సినిమా విదులయ్యే వరకు సీక్రెట్ గానే ఉంచాలని చూస్తున్నాము. ఎందుకంటే ఆసక్తికరమైన అంశాలు ముందుగా రివీల్ చేయకూడదు అని బన్నీ తెలిపాడు.

బాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్ ఎంట్రీ

ఇక అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడనే ప్రశ్నకు బన్నీ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు . సౌత్ ఇండియాతో పాటు నార్త్ లో కూడా నా మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా. నా ప్లానింగ్ కు తగ్గట్లుగా ఎలాంటి అవకాశం వచ్చినా ఉపయోగించుకుంటా అని అల్లు అర్జున్ తెలిపాడు. అల్లు అర్జున్ కు తెలుగుతో పాటు మలయాళీ చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X