69th National Film Awards తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్.. అవార్డులు అందుకొన్న ప్రముఖులు ఎవరో తెలుసా?
భారతీయ సినిమా పరిశ్రమలో ఉత్తమ చిత్రాలకు గుర్తింపు, ఉత్తమ దర్శకులకు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహం అందించే జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర సమాచార ప్రసారశాఖా మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్ తదితరులు హాజరయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ అవార్డుల ప్రధాన వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
69వ జాతీయ ఉత్తమ అవార్డుల కార్యక్రమంలో పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, మిమి సినిమా కోసం ఉత్తమ సహాయ నటుడిగా పంకజ్ త్రిపాఠి, ఉత్తమ నటిగా కీర్తి సనన్, గంగూభాయ్ కతియావాడి సినిమాకు ఆలియాభట్ అవార్డు అందుకొన్నారు. ఈ కార్యక్రమంలో వహిదా రెహ్మాన్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకొన్నారు.

69వ జాతీయ చలన చిత్ర అవార్డుల కార్యక్రమంలో జాతీయ మీడియాతో అల్లు అర్జున్ మాట్లాడారు. ఉత్తమ హీరోగా అవార్డు అందుకోవడం హ్యాపీగా ఉంది. కమర్షియల్‌గానే కాకుండా.. అవార్డు కూడా రావడం డబుల్ ధమాకా అని అల్లు అర్జున్ అన్నారు. యాంకర్ కోరిక మేరకు తెలుగులో తగ్గేదేలే అంట తనదైన శైలిలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్పారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పాల్గొన్నారు.
ఇక జాతీయ చలన చిత్ర అవార్డుల కార్యక్రమంలో ఉప్పెన చిత్రానికి మైత్రీ మూవీస్ అధినేత నవీన్ ఎర్నేని నిర్మాతగా, బుచ్చిబాబు దర్శకుడిగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకొన్నారు. RRR సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ రక్షిత్, ఉత్తమ ఫైట్ మాస్టర్‌గా కింగ్ సాలోమాన్, ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ శ్రీనివాస మోహన్ అవార్డులు అందుకొన్నారు.

పుష్ప చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్, కొండపొలెం సినిమాకు ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ తెలుగు సినిమా పరిశ్రమ తరుపున అందుకొన్నారు.
కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి పల్లవి జోషి అవార్డు అందుకొన్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో రాజమౌళి, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, ఆర్ మాధవన్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











