నంద్యాల కేసులో ట్విస్ట్.. అల్లు అర్జున్‌ వివాదంపై హైకోర్టు తీర్పు ఏమిటంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాలలో ఆయన పర్యటించడంపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి సమావేశం నిర్వహించారనే ఆరోపణలపై కేసు నమోదైంది. అయితే తనపైన నమోదైన కేసు నుంచి విముక్తి చేయాలని హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను పరిశీలించిన తర్వాత అల్లు అర్జున్‌కు ఊరట కలిగిస్తూ హైకోర్టు స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..

అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గంలో పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కలిసేందుకు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో వెళ్లడం రాజకీయంగా వివాదాస్పదమైంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఓ పార్టీకి అనుకూలంగా ఎలా వ్యవహరిస్తారనే ప్రశ్నలు సంధించారు.

Allu Arjun gets big Relief from High Court in Nandyal Visit Case

అయితే అల్లు అర్జున్ పర్యటన నేపథ్యంలో స్థానికంగా నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన పార్టీల నేతలే కాకుండా మెగా, అల్లు, పవర్ స్టార్ అభిమానుల్లో గందరగోళం నెలకొన్నది. అయితే భారీగా అభిమానులు రావడంతో శాంతి భద్రతల పరిస్థితులకు భంగం కలిగిందని ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది.

అయితే తాను ఎలాంటి రాజకీయ కారణాలతో నంద్యాలకు వెళ్లలేదు. నా ఉద్దేశం శాంతి భద్రతలకు భంగం కలిగించడం కాదు. తనపై నమోదైన కేసును సానుకూలంగా స్పందించండి. నాపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో అల్లు అర్జున్ తన న్యాయవాది తరఫున పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు సానుకూలంగా స్పందించింది.

అల్లు అర్జున్ కేసును విచారించిన కోర్టు గతంలో రిజర్వు చేసింది. తాజాగా బుధవారం ఈ కేసులో తీర్పు వెల్లడిస్తూ ఆయనపై ఉన్న ఈ కేసును కొట్టి వేసింది. దాంతో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. ఈ వివాదానికి ముగింపు పలకడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

More from Filmibeat

Read more about: allu arjun nandyal pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X