అల్లు అర్జున్‌ని చుట్టుముట్టిన కేరళ అభిమానులు.. కొత్త లుక్ కెవ్వు కేక, ఆర్య2!

Recommended Video

Allu Arjun Again In Arya 2 Look

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తరువాత అభిమానులని నిరక్షణలో పెట్టాడు. ఇంతవరకు కొత్త చిత్రం ప్రకటించలేదు. కానీ బన్నీ తదుపరి చిత్రానికి సంబంధించిన పనులు లోలోపలే జరిగిపోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. బన్నీ నెక్స్ట్ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టారో కేరళలో కూడా అంతే స్టార్ డమ్ ఉంది. బన్నీ సినిమాలంటే కేరళ అభిమానులు పిచ్చెక్కిపోతారు. తాజాగా బన్నీ కేరళ పర్యటన కోసం వెళ్ళాడు.

 ప్రభుత్వ ఆహ్వానం

ప్రభుత్వ ఆహ్వానం

కేరళ ప్రభుత్వం ప్రతి ఏటా నెహ్రు ట్రోఫీ బోట్ రేస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది బోట్ రేస్ కార్యక్రమాలని నవంబర్ 10 నుంచి నిర్వహించనున్నారు. దీని కోసం కేరళ ప్రభుత్వం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

 చుట్టుముట్టిన ఫ్యాన్స్

చుట్టుముట్టిన ఫ్యాన్స్

అల్లు అర్జున కు కేరళలో కూడా కళ్ళు చెదిరే ఫాలోయింగ్ ఉంది. బోట్ రేస్ కార్యక్రమం కోసం బన్నీ కేరళ వెళ్లలేదు. కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ లో దిగగానే అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఫాన్స్ అందరూ బన్నీని చుట్టుముట్టారు. ఎయిర్ పోర్ట్ ఆవరణం మొత్తం అభిమానులతో కోలాహలంగా మారింది.

అత్యధిక మార్కెట్

అత్యధిక మార్కెట్

టాలీవుడ్ హీరోలతోనే కేరళలో అత్యధిక మార్కెట్ ఉన్న నటుడు అల్లు అర్జున్. అందుకే బన్నీ సినిమాలు అక్కడకూడా నేరుగా విడుదలవుతుంటాయి. ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, డాన్సులతో కేరళ సినీ అభిమానులు బన్నీ ఫాన్స్ గా మారిపోయారు.

కేక పెట్టిస్తున్న కొత్త లుక్

కేక పెట్టిస్తున్న కొత్త లుక్

ఎప్పటికప్పుడు కొత్త స్టైల్ కో కనిపించడం బన్నీ ప్రత్యేకత. ప్రతి చిత్రంలోనూ విభిన్నంగా కనిపించడానికి బన్నీ ప్రయత్నిస్తాడు.కేరళలో బన్నీ సరికొత్త హెయిర్ స్టైల్ తో కనిపించాడు. ఈ ఫోటోలు చూడగానే ఆర్య 2 చిత్రంలో బన్నీ గుర్తుకు వస్తున్నాడని అంటున్నారు. బన్నీ కొత్త గెటప్ త్రివిక్రమ్ మూవీ కోసమే అనే ప్రచారం జరుగుతోంది. జులై చిత్రంలో అల్లు అర్జున్ డిఫెరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X