twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరా గ్రాండ్ సక్సెస్.. అల్లువారి సందడి.. బన్నీ ఎమోషనల్ పోస్ట్

    |

    సైరా విజయంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగి తేలుతోందని అందరికీ తెలిసిందే. నిర్మాతగా రామ్ చరణ్, హీరోగా చిరంజీవికి సైరా ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చింది. తొలి స్వతంత్ర్య సమర యోధుడైన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో చిరు తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారని యావత్ సినీ లోకం కొనియాడుతోంది.

    కలెక్షన్లతో సైరా హవా..

    కలెక్షన్లతో సైరా హవా..

    లాంగ్ వీకెండ్, దసరా సెలవులు ఇలా అన్నింటిని సైరా బాగానే వాడుకుంటోంది. వీటికి తగ్గట్లు సైరాపై అద్భుతమైన టాక్ రావడంతో వసూళ్లలో తిరుగులేకుండా పోతోంది. తొలిరోజే 85 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ఔరా అనిపించింది. మూడో రోజుల్లో దాదాపు 140 కోట్ల గ్రాస్ను రాబట్టి వంద కోట్ల షేర్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విధంగా సైరా సత్తా చాటితే.. దసరా సెలవులు పూర్తయ్యే నాటికి రికార్డుల మోత మోగుతోంది.

    మెగాఫ్యామిలీ ఇంట రెట్టింపైన సంబరాలు..

    మెగాఫ్యామిలీ ఇంట రెట్టింపైన సంబరాలు..

    నిర్మాతగా రామ్ చరణ్ అద్భుతమైన సినిమాను నిర్మిస్తే.. తన సినీ జీవితంలో మైలురాయిగా నిలిచే చిత్రంలో అద్భుతమైన నటనను చిరంజీవి ప్రదర్శించడంతో మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు ఆకాశన్నంటాయి. తండ్రీ కొడకులిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫోటోలు, తన్మయత్వంతో చరణ్ కు చిరు ముద్దు పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

    కాస్త ఆలస్యంగా వీక్షించిన బన్నీ..

    కాస్త ఆలస్యంగా వీక్షించిన బన్నీ..

    తన సినిమా పనులు, సొంత ఇంటిని నిర్మించే పనుల్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ సైరాను కాస్త ఆలస్యంగా చూశారు. అయితే ఫ్యామిలీతో సహా ఈ చిత్రాన్ని ఏఎంబీ థియేటర్లో చూసిన బన్నీ.. సైరా విజయంపై తన ఆనందాన్ని మొత్తం మెగా హీరోలతో కలిసి పంచుకున్నారు. సైరా అద్భుతమైన విజయం సాధించినందుకు.. అందరూ కలిసి గ్రాండ్ పార్టీ చేసుకున్నారు.

    పార్టీలో జాయిన్ అయిన త్రివిక్రమ్, సుకుమార్...

    పార్టీలో జాయిన్ అయిన త్రివిక్రమ్, సుకుమార్...

    అల్లు వారు అరెంజ్ చేసిన ఈ పార్టీకి మెగా హీరోలతో పాటు మరికొంత మంది అతిథులు కూడా విచ్చేశారు. త్రివిక్రమ్, సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, అఖిల్ అక్కినేని, శ్రీకాంత్ లాంటి వారు హాజరయ్యారు. ఇక మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్లో ఉన్న ఆ పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. అందర్నీ అలా ఒకే ఫ్రేమ్ లో చూస్తే కన్నులపండువగా ఉందంటూ మెగా అభిమానులు సంబరపడ్డారు.

    ఎమోషనల్ ట్వీట్ చేసిన బన్నీ..

    ‘సైరా అద్భుతమైన విజయాన్ని సాధించినందకు చిత్రయూనిట్ కు పార్టీ ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది. మన మెగాస్టార్ కోసం ఈ పార్టీని ఏర్పాటుచేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ ఆనందం మొత్తం మాదే.. పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరికీ అల్లు ఫ్యామిలీ తరుపున ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశాడు.

    English summary
    Allu ARjun Given Grand Party On Chiranjeevi Sye Raa Grand Success. Allu Family Hosted This Party To ALl Mega Heros And Other Special guests Like trivikram, Sukumar, Harish Shankar, Akhil, Srikanth Etc.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X