చంద్ర‌బాబుకి 25 ల‌క్ష‌ల చెక్ అందించిన అల్లు అర్జున్‌

By Bojja Kumar

హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితులకు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విష‌యం తెలిసిందే.అప్ప‌డు కొచ్చిన్ వున్న త‌న‌కి ఈ వార్త తెలిసి వెంట‌నే త‌న‌వంతు ఆర్దిక‌సాయం అందించాల‌ని 25 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. హుదూద్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర కకావికలమైందన్న వార్త తనను కలిచి వేసిందని కూడా అల్లుఅర్జున్ పేర్కొన్నారు.

అంతేకాకుండా టీవీల్లో తుఫాన్ వార్తలు తెలుసుకున్న అర్జున్ అక్క‌డి వారు పడుతున్న బాధలతో తీవ్ర ఆవేదనకు గురైనట్టు తెలిపాడు. నిన్న సాయంత్రం ఏపి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గారిని క‌లిసి త‌న ప్ర‌కటించిన ఆర్ధిక సాయం 25 ల‌క్ష‌ల చెక్ ని అందించారు.

Allu Arjun gives Rs 25 lakhs cheque to Chandrababu Naidu

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఇటీవ‌ల‌ సంభవించిన హుదుద్ తుఫాన్ భీభత్సంతో... నాకెంతో ఇష్టమైన విశాఖపట్నం రూపురేఖలను మార్చేయడం దురదృష్టకరం. ముఖ్యంగా రైతులు, మధ్యతరగతివారు, మత్స్యకారులు తీవ్రంగా నష్ట పోయారు. నేను ఇచ్చిన‌ 25 లక్షల ఆర్థిక సాయంలో ఎక్కువ భాగం సముద్రాన్నే నమ్ముకుని జీవించే మత్స్యకారుల కోసం ఉపయోగించాలని ఏ.పి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయిడు గారిని కొరాను. తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. వారి వలలు, పడవలు ధ్వంసమవ్వడంతో జీవనోపాధి దెబ్బతినడం నన్ను కలచివేసింది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిణామాలు భ‌విష్య‌త్తులో మ‌రొక్క‌సారి రాకుండా వుండాల‌ని ఆ భ‌గ‌వంతున్ని ప్రార్దిస్తున్నాను.. అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X