twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ సినిమానే అనేటట్లు కలర్ ఇవ్వటానికా ?

    By Srikanya
    |

    హైదరాబాద్ : తమ సినిమాలో అల్లు అర్జున్ వంటి స్టైలిష్ హీరో ఉన్నప్పుడు ఆయన్ని చూపి, హైలెట్ చేసి బిజినెస్ చేయటామే బెస్ట్ అనుకున్నట్లున్నారు రుద్రమదేవి టీమ్. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. అక్టోబర్ 18న ఈ చిత్రంలో ని అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసి, అల్లు అర్జున్ చిత్రం అనేటట్లు అభిమానుల్లో ఆనందం కలగచేయటానికి సిద్దమవుతున్నారు. దాంతో చిత్రానికి మంచి ఓపినింగ్స్ వచ్చే అవకాసం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

    అయితే చిత్రంలో అల్లు అర్జున్ ది చిన్న ఎపిసోడ్ మాత్రమే. సినిమా మొత్తం అనుష్క,రానా చుట్టూ తిరుగుతుంది అంటున్నారు. అలాగే... ఈ చిత్రంలో తమ సినిమాలో ముందు అనుకున్న గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ రాగానే పెంచినట్లు సమాచారం. అలాగే మీడియాలో కూడా అల్లు అర్జున్ ఈ చిత్రంలో చేస్తున్న విషయం బాగా నలిగేటట్లు దర్శక,నిర్మాతలు చూసుకుంటున్నారు.

    అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి'. రానా, అల్లు అర్జున్‌, కేథరిన్‌ ముఖ్య పాత్రధారులు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా స్టీరియో స్కోపిక్‌ త్రీడీ విధానంలో తెరకెక్కుతున్న చిత్రమిది.

     Allu arjun Gona Ganna reddy First look on oct 18th

    నిర్మాత మాట్లాడుతూ... ''కాకతీయుల కాలాన్ని దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్‌ నటన చిత్రానికి కలిసొస్తుంది. అనుష్క, అల్లు అర్జున్‌ మధ్య చిత్రిస్తున్న సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి'' అంటున్నారు.

    గుణ శేఖర్ మాట్లాడుతూ... ''కాకతీయుల చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానముంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఓ వ్యక్తి పాత్ర అది. ఈ పాత్రకు ఎవరు సరితూగుతారా అని ఆలోచిస్తుండగా అల్లు అర్జున్‌ గుర్తొచ్చాడు. పాత్రకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న కథానాయకుడతను. ఈ కథ గురించి చెప్పగానే అతడు కూడా వెంటనే అంగీకరించాడు. దీంతో నేటి తరం హీరోలలో ఇలాంటి పాత్రలు పోషించడానికి నాంది పలికినవాడిగా బన్నీ నిలుస్తాడు.

    ఎన్టీఆర్‌కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్‌కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి మా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది.'' అంటూ వివరించారు గుణశేఖర్‌. ఈ సినిమాలో అనుష్క, రానా, నిత్యమీనన్‌, కృష్ణంరాజు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

    ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

    English summary
    As per the production house, The first look of Allu Arjun in 'Rudramadevi' would be unveiled on October 18th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X