ఒకే వేదికపై అల్లు అర్జున్, సాయి పల్లవి.. గ్రాండ్ రిలీజ్‌కు అంతా సిద్ధం!

లై చిత్రంతో యాక్షన్ ప్రయోగం చేసిన దర్శకుడు హను రాఘవపూడికి నిరాశ ఎదురైంది. లై చిత్రాన్ని ప్రేక్షకులని మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడిన సంగతి తెలిసిందే. దీనితో హను రాఘవపూడి ఈ సారి ఎమోషనల్ ప్రేమ కథతో రాబోతున్నాడు. శర్వానంద్, క్రేజీ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న పడి పడి లేచే మనసు చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. సాయి పల్లవి తెలుగు యువతని మరోమారు మాయ చేయడానికి సిద్ధం అవుతోంది. ఇటీవల విడుదలైన పడిపడి లేచే మనసు ట్రైలర్ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా

అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా

పడి పడిలేచే మనసు చిత్ర ఆడియో వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నా పేరు సూర్య చిత్రం తరువాత బన్నీ ఇంతవరకు కొత్త చిత్రాన్ని ప్రారంభించలేదు. కానీ ఇలా సినిమా వేడుకలకు హాజరవుతూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటున్నాడు. అల్లు అర్జున్, సాయి పల్లవి ఒకే వేదికని పంచుకోనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

క్లీన్ 'యూ' సర్టిఫికెట్

క్లీన్ 'యూ' సర్టిఫికెట్

పడి పడి లేచే మనసు చిత్ర విడుదలకు అంతా సిద్ధం అయింది. తాజగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ సర్టిఫికెట్ జారీ చేశారు. డిసెంబర్ 21 న ఈ చిత్రాన్ని విడుదుల చేయనున్నారు. డిసెంబర్ 17న ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు యువత నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

 ఎమోషనల్ లవ్ స్టోరీ

ఎమోషనల్ లవ్ స్టోరీ

హను రాఘవపూడి ఈ చిత్రాన్ని ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కించారు. సరదాగా సాగే ఈ ప్రేమ కథలో అద్భుతమైన మలుపులు కూడా ఉంటాయట. ఈ చిత్ర పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. శర్వానంద్ కు ఈ చిత్ర విజయం చాలా అవసరం. శతమానం భవతి తరువాత శర్వానంద్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరిగా రాణించలేదు. ఇక ఫిదా, ఎంసీఏ లాంటి చిత్రాల విజయాలతో, ముఖ్యముగా తన నటనతో సాయి పల్లవి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

తీవ్రమైన పోటీ

తీవ్రమైన పోటీ

డిసెంబర్ 21న బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ ఉండబోతోంది. శర్వానంద్ పడి పడి లేచే మనసు, వరుణ్ తేజ్ అంతరిక్షం, కన్నడ హీరో యాష్ నటించిన కెజిఎఫ్ చిత్రాలు ఆరోజునే విడుదల కానుండడం విశేషం. ఈ మూడు చిత్రాలపై మంచి అంచనాలు ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పై చేయి సాధిస్తుందో అనే టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X