అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్.. కానీ, ఆ కండిషన్స్ అప్లై..

Allu Arjun Case: సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఊరట లభించింది. ఈ కేసులో అల్లు అర్జున్ కు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. అయితే.. కోర్టు కొన్ని షరతులను పెట్టింది. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటంటే?

పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ చేరుకోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ అభిమానురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీ తేజ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఘటనకు బాధ్యులైన థియేటర్ యజమాన్యం, పుష్ప 2 నిర్మాతలు హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు.

Allu Arjun granted regular bail in theatre stampede case by Hyderabad court AND bail conditions

విచారణలో భాగంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి, నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు 14 రోజుల రిమైండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ న్యాయవాదులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి మద్యంతర బెయిల్ ను తీసుకువచ్చారు. దీంతో మరుసటి రోజే అల్లు అర్జున్ ను విడుదల చేశారు. ఈ తరుణంలో టాలీవుడ్ అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచింది దీంతో ఈ మ్యాటర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ తీరుపై మండిపడ్డారు. అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఆ గొడవను మరింత పెంచాడు ఎక్కలేని అబద్ధాలు చెప్పి పోలీసులు తనని ఇరికించారని తనకేమీ తెలియదు చెప్పుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు అల్లు అర్జున్ ను మళ్లీ విచారణ కు పిలిచి విచారించారు.

తాజాగా నాంపల్లి కోర్టు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియడంతో అల్లు అర్జున్ కోటి ఎదుట వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంలో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని అతని తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది.

Allu Arjun granted regular bail in theatre stampede case by Hyderabad court AND bail conditions

ఇంతకీ ఆ కండిషన్స్ ఏమిటంటే.. 50వేల రెండు పూచికత్తులను సమర్పించాలని ఆదేశించింది. అలాగే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని కండిషన్ పెట్టింది. అంతేకాకుండా ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని అల్లు అర్జున్ కు షరతులను విధించింది నాంపల్లి కోర్టు. దాంతోపాటు పోలీసులు పెట్టిన కండిషన్లు అలాగే ఉంటాయని చెప్పింది. పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా అప్పుడు హాజరు కావాలని ఆదేశించింది. అలాగే ఇకపై ప్రెస్మీట్లో పెట్టరాదని బహిరంగంగా ఎలాంటి కామెంట్స్ చేయరాదని న్యాయస్థానం సూచించింది.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X