twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జులాయి’లో సరికొత్తగా... ఇతర హీరోలకు సవాల్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ విషయంలో మంచి టాలెంట్ ఉన్న హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయంలో ఇతర హీరోలు అతనితో పోటీ పడటం కాస్త కష్టమే. తన బాడీని ఎలా అంటే అలా మెలికలు తిప్పడం కోసం అల్లు అర్జున్ తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో గాయాలపాలైన సందర్భాలు కూడా ఉన్నాయి.

    తాజాగా 'జులాయి' చిత్రంలో అల్లు అర్జున్ సరికొత్త స్టెప్పులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక రకంగా ఈ చిత్రం ద్వారా డాన్స్ విషయంలో తనకు ఎవరూ సాటి రారు అనే విధంగా బన్నీ ఇరగదీశాడని టాక్. కొరియోగ్రాఫర్ తో కలిసి కొత్త రకమయిన స్టెప్స్ కోసం బన్నీ కష్టపడ్డారు. డాన్స్ ప్రేమికులకు మరియు అల్లు అర్జున్ అభిమానులకు ఇది ఆనందకరమయిన విషయం.

    అల్లు అర్జున్-ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జులాయి' చిత్రం ఆగస్టు 9న విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పణ: డివివి దానయ్య, నిర్మాత: ఎన్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    Stylish Star Allu Arjun is one of the best dancers in the industry without a doubt and his steps are always a delight to watch. The latest buzz in Filmnagar is that Bunny has tried out some new dance moves in his upcoming film ‘Julayi’. He has apparently worked with the choreographer to come up with new and unique steps for the film. This should be a treat for Allu Arjun fans and dance lovers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X