మెగా హీరోలిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఇక మెగాఫ్యాన్స్ కి పండగే..!
రామ్ చరణ్ ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో చేస్తున్న 'రచ్చ' షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయినట్టే. దీని తర్వాత రామ్ చరణ్ చేయబోతున్న 'వాడే' వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పనలో గంటా శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిచబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి ఓ చిత్రంలో నటించనున్నారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం ఇప్పట్లో ఉండదని, కాకపోతే కలిసి నటించేందుకు తామిద్దరం ఎదురు చూస్తున్నామిని ఇద్దరూ చెప్పారు. త్వరలోనే వీరిద్దరి కలయికలో ఓ చిత్రం తెరకెక్కే అవకాశాలున్నాయని మరోసారి ఫిలింనగర్ లో వినిపిస్తోంది.
రామ్ చరణ్ హీరోగా పైడిపల్లి వంశీ దర్శకత్వంలో చిత్రంలో అల్లు అర్జున్ అతిథి పాత్ర పోషిస్తాడట. ఈ విషయాన్ని అల్లు అర్జున్ కూడా చూచాయగా చెప్పాడు. చివరి 40నిమిషాల్లో 20నిమిషాలు బన్నీ ఓ స్పెషల్ రోల్ లో కనిపిస్తాడు. అది ఈ చిత్రానికి ఎంతో కీలకమైందని తెలుస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో నెగెటివ్ రోల్ చేయబోతున్నాడు. ప్రస్థానం చిత్రంతో నంది అవార్డు గెలుచుకున్న సాయికుమార్ ఈ సినిమాలోనూ అలాంటి ఓ అద్భుతమైన పాత్రను దక్కించుకున్నాడు. ఇన్ని ప్రత్యేకతలు వున్న ఈ సినిమా రామ్ చరణ్ కి ఓ స్పెషల్ మూవీ అనే చెప్పాలి.
ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడు. జూ ఎన్టీఆర్ 'బృందావనం' సినిమాతో సక్సెస్ అయిన వంశీ ఈసారి అంతకంటే భారీ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఆ శుభవార్త మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా తెలిసే అవకాశముంది. యువ మెగా హీరోలిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులకి అంతకంటే కావలిసింది ఏముంటుంది.


Click it and Unblock the Notifications











