గుణశేఖర్ సుడి అల్లు అర్జున్ తిప్పుతాడా?

ఇక ఆ మధ్య ఆయన భారీ చిత్రాల నిర్మాత ఎమ్.ఎస్.రాజు తో కలసి సాధు చిత్రాన్ని బాలకృష్ణ హీరోగా చెయ్యబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అదీ మెటీరియలైజ్ కాలేదు. తర్వాత గోన గన్నారెడ్డి కథ నాగార్జున కి నచ్చిందని ఆయన చెయ్యబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో నాగార్జున నేను వేరే కింగ్ కథ చేసుకుంటానని శ్రీను వైట్ల కి డేట్స్ ఇచ్చారు. దాంతో పరాజయం ఎంత పరాభవాల్ని అందిస్తుందో అవగాహన చెందిన గుణశేఖర్ మొదట మనస్తాపం చెందినా ఇప్పుడు తేరుకుని మంచి సబ్జెక్టుతో అల్లు అరవింద్ ని మెప్పించి అల్లు అర్జున్ డేట్స్ సంపాదించాడని చెప్తున్నారు. దాంతో గుణశేఖర్ సుడి వరస హిట్స్ తో ముందుకెళ్తున్న అల్లు అర్జున్ తో తిర్గనుందని అంతా అంటున్నారు.బెస్టాఫ్ లక్ గుణ శేఖర్..


Click it and Unblock the Notifications











