అల్లు అర్జున్, గుణశేఖర్ ల 'వరుడు' రిలీజ్ డేట్

By Srikanya

అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న 'వరుడు' చిత్రం వేసవి కానుకగా మార్చి ఇరవై ఆరున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.అయితే అధికారికంగా ఈ డేట్ ని ప్రకటించలేదు. ఈ చిత్రంలో చలా భాగం ఓ వివాహం చుట్టూ తిరుగుతుందని సమాచారం. అలాగే ఈ చిత్రం కోసం నిజమైన వంద ఫ్యామలీలను ఎంపిక చేసి వారికి ఆరు నెలలు పాటు ట్రైనింగ్ ఇచ్చి మరీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో తాతగా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తున్నారు. ఇక హీరో అల్లు అర్జున్ కు తల్లిగా సుహాసిని చేస్తోంది. కుటుంబ భావోద్వాగాలు, ఫన్ కలగలపిన ఈ చిత్రం సమ్మర్ లో టాప్ గా నిలుస్తుందని ట్రేడ్ లో అప్పడే అంచనాలు మొదలయ్యాయి. అందులో ఒక్కడు వంటి సూపర్ హిట్ మూవీ ని ఇచ్చిన గుణశేఖర్ దర్శకుడు కావటం ఈ చిత్రానికి మరో ప్లస్. అలాగే యూనివర్సల్ మీడియా పతాకం పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ హీరోగా చేసిన ఆర్య-2 చిత్రం రిలీజై నెగిటివ్ ఫలితాన్ని బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. అల్లు అర్జున్ మరో దర్శకుడు క్రిష్ తో వేదం చిత్రంలో చేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X