»   » అరుదే కానీ మాకు సాధ్యమైంది: దిల్ రాజు, బన్ని ‘డిజె’ లాంచ్ లో... (వీడియో, ఫొటోలు)

అరుదే కానీ మాకు సాధ్యమైంది: దిల్ రాజు, బన్ని ‘డిజె’ లాంచ్ లో... (వీడియో, ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొంత మందితో రిలేషన్..మనకు తెలవకుండా ఏర్పడుతుంది. అదే నాకు హరీష్ తో ఏర్పడింది. వెళ్తున్న కొద్దీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. వేవ్ లెంగ్త్ కలుస్తూంటే, రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. సినిమా పీపుల్...బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేయటం అరుదు. అది హరీష్ కు మా బ్యానర్ తో ఉన్న రిలేషన్ తో సాద్యమైంది అన్నారు దిల్ రాజు.

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న చిత్రానికి 'డీజే.. దువ్వాడ జగన్నాథమ్' అనే టైటిల్ ఖరారు చేసి ఈ రోజు హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న 25వ చిత్రమిది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

'సరైనోడు'గా అదరకొట్టిన అల్లు అర్జున్‌ ఇప్పుడు 'దువ్వాడ జగన్నాథమ్‌' అవతారం ఎత్తాడంతో అభిమానుల ఆనందానికి అంతేలాదు. పంచ్ లతో అదరకొట్టే హరీష్ శంకర్ మెగా ఫోన్ పెట్టి బన్నికు సూపర్ హిట్ అవటానికి సిద్దపడటం ఈ సినిమాకు మరో ప్లస్. మూవీ లాంచ్ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత అల్లు అరవింద్‌ తొలి సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. వీవీ వినాయక్‌, వంశీ పైడిపల్లి, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్‌రాజు ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడిస్తూ ఫొటో పోస్ట్‌చేశారు. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

లాంచ్ ఫొటోలు మరిన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.

దిల్‌రాజు మాట్లాడుతూ...

దిల్‌రాజు మాట్లాడుతూ...

ఈరోజు బన్ని హీరోగా మా బ్యానర్‌లో డి.జె...దువ్వాడ జగన్నాథం సినిమా ప్రారంభమైంది. ఆర్య, పరుగు తర్వాత బన్నితో ఈ సినిమా హ్యాట్రిక్‌ మూవీ

ఎగ్జయిటింగ్ గా

ఎగ్జయిటింగ్ గా


మా బ్యానర్‌కు ఇది 25వ సినిమా కావడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇది కూడా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది.

పరిచయం

పరిచయం


హరీష్‌ శంకర్‌తో గబ్బర్ సింగ్ నుండి మంచి పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి తనతో చేసిన ట్రావెల్‌లో మంచి అనుబంధం ఏర్పడింది.

వరసగా

వరసగా


మా బ్యానర్ లో హరీష్ తో వరుస సినిమాలు చేస్తున్నాం. హరీష్ దర్శకత్వంలో చేస్తున్న మూడో సినిమా.

వచ్చే సమ్మర్ కు..

వచ్చే సమ్మర్ కు..


తప్పకుండా మంచి హిట్‌ సినిమాను రూపొందించేలా అందరం కష్టపడి వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు దిల్ రాజు.

 హిట్ ,ఫ్లాపులకు సంభందం లేకుండా

హిట్ ,ఫ్లాపులకు సంభందం లేకుండా

హరీష్ శంకర్, దిల్ రాజు ఇద్దరూ హిట్ ఫ్లాఫు లకు సంభందం లేకుండా ప్రయాణం చేస్తూ ఈ సినిమా దాకా లీడ్ చేసారు

రామయ్య ప్లాఫైనా

రామయ్య ప్లాఫైనా

రామయ్యా వస్దావయ్యా చిత్రం ఫ్లాఫ్ అయినా దిల్ రాజు మరోసారి అవకాసం ఇచ్చి సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం నిర్మించారు

ముచ్చటగా

ముచ్చటగా


ఇదే బ్యానర్ లో దిల్ రాజు, హరీష్ లది ముచ్చటగా మూడో చిత్రం కావటం విశేషం.

బన్నీకు కూడా

బన్నీకు కూడా


అంతేకాకుండా బన్ని కు కూడా ఇదే బ్యానర్ లో మూడో సినిమా. అంతకు ముందు ఆర్య, పరుగు గ్యాప్ తర్వాత ఈ చిత్రం పట్టాలు ఎక్కుతోంది

దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ...

దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ...

`డి.జె...దువ్వాడ జగన్నాథమ్` ఈరోజు లాంచనంగా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇది దిల్‌రాజుగారి బ్యానర్‌లో వస్తున్న 25వ సినిమా. ఆయనతో గబ్బర్‌ సింగ్‌ సినిమా నుండి అనుబంధం కొనసాగుతుంది. వరుసగా సినిమాలు చేస్తున్నాను.

 ముప్పై సినిమాలైనా

ముప్పై సినిమాలైనా

ఇదే బ్యానర్ లో తను ముప్పై సినిమాలు చేసినా ఆశ్చర్యం లేదన్నట్లు హరీష్ శంకర్ మాట్లాడారు. ఆయనకు, ఆ టీమ్ కు అలా సెట్ అయ్యిందన్నమాట

డిజే..టెక్నీషియన్స్

డిజే..టెక్నీషియన్స్

ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతంరాజు, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్‌, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: దీపక్‌ రాజ్‌ నిర్మాత: దిల్‌రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌.

English summary
Bunny, Harish Shnaker, Dil Raju's DJ (Duvvada Jagannatham) movie Opening held at Jublee Hills FNCC Daiva Sannidhanam today (29th Aug) morning, Allu Aravind given the clap for muhurath shot of the film. Today at 7.45am, muhurat event of Bunny and Harish's film held.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu