Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నన్ను బయిటకు వెళ్లనీయటం లేదు:హరీష్ శంకర్, బన్ని ‘డిజె’ లాంచ్ లో (ఫొటోలు)
హైదరాబాద్: గబ్బర్ సింగ్ అయ్యాక ..రాజుగారి బ్యానర్ లోకి ఎంటర్ అయ్యాను..బయిటకు వెళ్లటం లేదు. ఆయనా వెళ్లనీయటం లేదు. ఈ బ్యానర్ లో 25వ సినిమా చేయటం చాలా ఆనందంగా ఉందంటున్నారు దర్శకుడు హరీష్ శంకర్.
'సరైనోడు'గా అదరకొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు 'దువ్వాడ జగన్నాథమ్' అవతారం ఎత్తాడు. పంచ్ లతో అదరకొట్టే హరీష్ శంకర్ మెగా ఫోన్ పెట్టి బన్నికు సూపర్ హిట్ అవటానికి సిద్దపడ్డాడు.
అల్లు అర్జున్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. హరీష్ శంకర్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రానికి 'డిజె' అనే పేరు ఖరారు చేశారు. డిజె అంటే 'దువ్వాడ జగన్నాథమ్' అన్నమాట. ఆదివారం ట్విట్టర్‌లో టైటిల్‌ని అధికారికంగా ప్రకటించారు అల్లు అర్జున్. సోమవారం లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభించారు.
దిల్ రాజు మాట్లాడుతూ ''మా సంస్థ నుంచి వస్తున్న 25వ చిత్రమిది. బన్నీతో మూడోసారి పని చేస్తున్నాం. హరీష్‌తోనూ ఇదే హ్యాట్రిక్ చిత్రం. మా కాంబినేషన్‌లో కచ్చితంగా మరో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు''అన్నారు. ఈ చిత్రానికి కూర్పు: గౌతం రాజు, కళ: ఎస్.రవీందర్, పోరాటాలు: రామ్-లక్ష్మణ్.
లాంచ్ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

దైవసన్నిధానంలో
హైదరాబాద్ ఎఫ్ ఎన్ సీసి (ఫిల్మ్ నగర్ వద్ద ) ఈ ప్రారంభోత్సవం జరిగింది.

క్లాప్
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు,

స్విచ్చాన్
ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు.

గౌరవ దర్శకత్వం
ప్రమఖ దర్శకుడు వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ...
`డి.జె...దువ్వాడ జగన్నాథమ్` ఈరోజు లాంచనంగా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇది దిల్‌రాజుగారి బ్యానర్‌లో వస్తున్న 25వ సినిమా. ఆయనతో గబ్బర్ సింగ్ సినిమా నుండి అనుబంధం కొనసాగుతుంది. వరుసగా సినిమాలు చేస్తున్నాను.

ఆర్యనుంచే..
ఆర్య సినిమా నుండి అల్లుఅర్జున్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికీ ఆ కోరిక తీరింది. బన్నికి థాంక్స్ అన్నారు హరీష్.

అల్లు అరవింద్ గారి సాయిం
అలాగే ఎప్పుడు అడిగిన తన విలువైన సమయాన్ని కేటాయించడమే కాకుండా అల్లు అరవింద్‌గారు తన విలువైన సలహాలను కూడా అందిస్తుంటారు.
అందుకు ఆయనకు నా స్పెషల్ థాంక్స్ అని చెప్పారు హరీష్ శంకర్

రెగ్యులర్ షూటింగ్
డి.జె.దువ్వాడ జగన్నాథమ్ సినిమా రెగ్యులర్ సెప్టెంబర్ నుండి జరుగుతుంది అని తెలిపారు హరీష్

రిలీజ్ ఎప్పుడంటంటే
అలాగే సినిమాను ఏప్రిల్ మొదటివారంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం'' అన్నారు హరీష్ శంకర్.

ప్రతిష్ట్తాత్మకంగా
ఈ సినిమాను దిల్ రాజు చాలా ప్రతిష్ట్రాత్మకంగా భావించి నిర్మిస్తున్నారు

మూడో సినిమా
ఈ బ్యానర్ లో హరీష్ శంకర్ కు ఇధి మూడో సినిమా. అంతకు ముందు రామయ్య వస్తావయ్యా, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాలుని డైరక్ట్ చేసారు ఇదే బ్యానర్ లో దిల్ రాజు నిర్మాతగా

టెక్నీషియన్స్
ఈ చిత్రానికి ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: రవీందర్, ఫైట్స్:రామ్-లక్ష్మణ్, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: దీపక్ రాజ్ నిర్మాత: దిల్‌రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్.