»   » నా గుండె పగిలిపోయింది: అభిమాని మరణంపై అల్లు అర్జున్ ఆవేదన!

నా గుండె పగిలిపోయింది: అభిమాని మరణంపై అల్లు అర్జున్ ఆవేదన!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన అభిమాని దేవసాయి గణేష్ మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం వినగానే స్టైలిష్ స్టార్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గణేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

  'సాయి గణేశ్ మృతి వార్త విని నా గుండె పగిలిపోయింది. అతని కుటుంబసభ్యులకు, సన్నిహితులకు నా సానుభూతి' అని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అల్లు అర్జున్ పేర్కొన్నారు. పలువురు బన్నీ అభిమానులు అనకాపల్లి చేరుకుని గణేష్ కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు.

  Allu Arjun heartbroken over his fan’s death

  అనకాపల్లికి చెందిన 10వ తరగతి కుర్రాడు దేవసాయి గణేష్ అల్లు అర్జున్‍‌కు వీరాభిమాని. కొంత కాలంగా గణేష్ బోన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. తన అభిమాన నటున్ని చూడాలని, కలవాలని దేవసాయి గణేష్ కోరడంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఫ్యాన్ అసోసియేషన్స్ ద్వారా అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లారు.

  తన అభిమాని గణేష్ కోరికపై వెంటనే స్పందించిన స్టైలిష్ స్టార్ ఇటీవల అనకాపల్లి వెళ్లి గణేష్‌ను కలిసిశారు. త్వరలోనే కోలుకుంటావని దైర్యం చెప్పారు. అతడి చికిత్స కోసం ఆర్థిక సహాయం చేసేందుకు కూడా బన్నీ ముందుకొచ్చారు. అయితే ఇంతలోనే విషాదం చోటు చేసుకోవడంతో బన్నీ విచారం వ్యక్తం చేశారు.

  English summary
  Allu Arjun meet his ardent teen fan named Devasai Ganesh at Anakapalli. Ganesh was suffering from bone cancer for the last couple of years and one of his last wishes was to meet Allu Arjun.In a tragic update, Allu Arjun took to Instagram and revealed that Ganesh breathed his last today. The actor said he was heartbroken over his fan’s death.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more