భార్యతో అల్లు అర్జున్ చిలిపి గొడవ.. ఎవరివల్లనో తెలుసా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఇంత వరకు బన్నీ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించలేదు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో నటించబోతున్నట్లు మాత్రం అధికారిక ప్రకటన గత నెలలో వెలువడింది. సినిమా ప్రారంభమయ్యే లోపు విలువైన సమయాన్ని తన ఫ్యామిలీ కోసం బన్నీ వెచ్చిస్తున్నాడు. అల్లు అర్జున్ నిన్న తన ముద్దుల కుమార్తె అర్హతో సరదాగా జరిగిన సంభాషణ సోషల్ మీడియాని ఊపేస్తోంది దీని అనంతరం అల్లు అర్జున్, స్నేహ దంపతుల మధ్య చిలిపి గొడవ ఒకటి జరిగింది.

నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి
అల్లు అర్జున్ తన ముద్దుల కుమార్తె అర్హతో నాన్న చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటావు కదూ అని అడిగాడు. దీనిని అర్హ చాలా ఫన్నీ రిప్లై ఇచ్చింది. నేను చేసుకోను అని చెప్పేసింది. బన్నీ ఎంత బతిమిలాడినా నేను చేసుకోను అనే మాట మార్చలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తోంది. బన్నీ ఈ వీడియోని ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేయగా 24 గంటల్లోపే 1 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఫాన్స్ లైక్స్, షేర్స్ తో ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

భార్యతో చిలిపి గొడవ
బన్నీ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం సతీమణి అల్లు స్నేహ స్పందించింది. అల్లు అర్జున్ ని సరదాగా ఓ ప్రశ్న అడిగింది. నువ్వు చేసుకున్నావా మీ నాన్న చెప్పిన అమ్మాయిని అని అడగగా బన్నీ కూడా అంతే సరదాగా సమాధానం ఇచ్చాడు. అబ్బా చా.. నువ్వు చూసుకున్నావా అని అడిగాడు. వీళ్లిద్దరి చిలిపి గొడవ నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంది. వీళ్లిద్దరి సంభాషణ రానా, మంచు లక్ష్మి, అల్లు శిరీష్ లాంటి సెలెబ్రిటీలని కూడా ఆకట్టుకుంది. బన్నీ, స్నేహ చాట్ కు లైక్స్, స్మైలీ ఎమోజిలతో ఫ్యాన్స్ మోతెక్కిస్తున్నారు.

అదిరిపోయే చిత్రాన్ని
ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో చిత్రం త్వల్లోనే సెట్స్ పైకి వెళ్లనుంది. గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్త నిర్మాణంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సారి అభిమానులకు ఎలాగైనా అదిరిపోయే చిత్రాన్ని అందించాలని బన్నీ పట్టుదలతో ఉన్నాడు. అందుకే గ్యాప్ ఎక్కువైనా త్రివిక్రమ్ కథనే ఒకే చేశాడు.

చాలా మంది హీరోయిన్ల పేర్లు
ఈ చిత్రంలో బన్నీకి జోడిగా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ చిత్రం కోసం దాదాపుగా ఒకే అయిందని ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం క్రేజీ హీరోయిన్ రష్మిక పేరు కూడా వినిపిస్తునట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి త్వరలో వివరాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











