స్పెయిన్ కి వెళ్లిన అల్లు అర్జున్
హైదరాబాద్: రీసెంట్ గా విడుదలైన జులాయి హిట్ టాక్ తెచ్చుకోవటంతో హ్యాపీ ఫీలైన అల్లు అర్జున్ కొద్ది రోజులు రెస్ట్ కు హాలీడే ట్రిప్ కు వెళ్లారు. స్పెయిన్ లో ఈ హాలీడే ని ఎంజాయ్ చేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారం చివరలో ఇక్కడికి తిరగి వస్తారని సమాచారం. ఇండియాకి తిరిగి రాగానే... తన తదుపరి చిత్రం హడావిడిలో పడిపోతారు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చి ఈ మ్యూజిక్ సిట్టింగ్ లో పాల్గొంటారని సమాచారం.
అల్లు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న 'ఇద్దరు అమ్మాయిలతో..' చిత్రం సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసిన పూరీ జగన్నాగ్ ఈ మేరకు స్కిప్టు వినిపించటం జరగింది. అది విన్న అల్లు అర్జున్ చాలా ఎక్సైట్ మెంట్ తో ఉన్నారని సమాచారం. అసలు కరెక్షన్ ఏమీ చెప్పలేదని,ఈ చిత్రం తన కెరిర్ లో మరోసారి దేశముదరు రేంజిని దాటే హిట్ వస్తుందని నమ్మి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం షూటింగ్ మొత్తం అబ్రాడ్ లో జరపనున్నట్లు పూరీ జగన్నాధ్ తెలియచేసారు. బ్యాంకాక్ లో షూటింగ్ మొదలయ్యి అమెరికాలో జరగనుందని తెలుస్తోంది. దేశముదురు కాంబినేషన్ అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ ని రిపీట్ చేస్తూ బండ్ల గణేష్ రూపొందించే ఈ చిత్రం బారీగా రూపొందనుంది. హీరోయిన్స్ సెంట్రల్ గా నడిచే కధ కాబట్టి ఆ టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో చేసే ఇద్దరు హీరోయిన్స్ లో తాప్సీ ని ఎంపికచేసారు. మరొకరు కోసం చూస్తున్నారు. 2013 జనవరికి విడుదల అయ్యే ఈ చిత్రం కథ కేవలం ట్రీట్ మెంట్ బేసెడ్ గా నడుస్తుందిని సమాచారం.
అల్లు అర్జున్ ఇటీవలే 'జులాయి'గా తెరపైకి వచ్చారు. ఆ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా బాగుంది. అలాగే మళయాళంలోనూ ఈ చిత్రం మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంది. ఈ విషయమై మాట్లాడుతూ... ''నా సినిమాలు మలయాళంలోనూ ఆదరణ పొందడం సంతోషంగా ఉంది. అలాగని నేనేమీ అక్కడి హీరోలకు పోటీగా నిలుస్తున్నాను అనుకోను. నాకంటూ అక్కడో మార్కెట్‌ని ఏర్పరచుకోగలిగాను'' అన్నారు . "ఇక 'జులాయి'తో మరో మెట్టు ఎక్కాను అన్నారు. ఆ మెట్టు త్రివిక్రమ్‌తో సినిమా చేయడమే... ఓ గొప్ప అనుభూతి" అని వివరించారు.


Click it and Unblock the Notifications











