మెగా హీరోలందర్నీ ఒక్క చోట చేర్చిన బన్నీ.. అదిరిపోయే పార్టీతో హంగామా
Recommended Video
మెగా ఫ్యామిలీకి ఇవి మరుపురాని క్షణాలు. సైరాను అద్భుతంగా తెరకెక్కించి రామ్ చరణ్, చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇంత పెద్ద విజయం సాధించినందుకు అంతా ఆనందంలో మునిగిపోయారు. నిర్మాతగా రామ్ చరణ్ ఓ మెట్టు ఎక్కితే.. హీరోగా తన కలను సాకారం చేసుకున్నాడు చిరంజీవి. ఇక ఈ రెండు విజయాలతో మెగా ఫ్యామిలీలో సందడి మొదలైంది.

జాతీయ స్థాయిలో సైరా..
సైరాను కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా.. యావత్ భారతావని తలెత్తుకునేలా చేయాలని.. సైరాను భారతీయ చిత్రంగా మలిచేందుకు నిర్మాత రామ్ చరణ్ చాలా కష్టడ్డాడు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, కన్నడ సూపర్ స్టార్ కిచ్చాసుదీప్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా ఇలా అన్ని ఇండస్ట్రీలకు చెందిన అగ్ర నటులందర్నీ ఒక్కతాటిపైకి తెచ్చిసైరాను నిర్మించాడు.

ఘన విజయాన్ని సాధించిన సైరా..
భారత స్వాత్రంత్యం కోసం పోరాడిన తొలి యోధుడు, రేనాటి వీరుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సైరాగా మలిచి.. మరోసారి మహానుభావుల చరిత్రను నేటి ప్రేక్షకులకు చూపించారు. కథ పరంగానే కాకుండా.. నటీనటుల పర్ఫామెన్స్ పరంగా.. సాంకేతిక పరంగా ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. ఇలా అన్ని కలిసి ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించేలా చేశాయి.

రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న సైరా..
మొదటి రోజే 85 కోట్ల గ్రాస్ తో సైరా మరో సారి టాలీవుడ్ సత్తా చాటింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా హవా నడుస్తుండగా.. బాలీవుడ్లోనూ అక్కడి సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తోంది. ఇక తమిళ నాట ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. మిగిలిన అన్ని చోట్లా సైరా విజయపతాకాన్ని ఎగురవేస్తోంది.

సొంత పనులతో ఆలస్యంగా వీక్షించిన బన్నీ..
తన సినిమా షూటింగ్స్, కొత్త ఇంటి నిర్మాణ పనులతో బిజీగా ఉన్న స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ఆలస్యంగా సినిమాను చూశాడు. నిన్నసాయంత్రం సైరాను వీక్షించిన బన్నీ.. రాత్రే ఓ గ్రాండ్ పార్టీని ఇచ్చాడు. దీనికోసం మెగా హీరోలందర్నీ ఒక్కచోటుకు చేర్చాడు.

హాజరైన అఖిల్, శ్రీకాంత్..
సైరా అద్భుతమైన విజయం సాధించినందుకు బన్నీ.. ఇలా తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి, శ్రీకాంత్, అఖిల్, హరీష్ శంకర్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ, అల్లు శిరీష్ ఇలా అందరూ ఈ పార్టీకి హాజరయ్యారు. అందరూ కలిసి సైరా విజయాన్ని ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











