అల్లు అర్జున్ గెస్ట్‌హౌస్ పార్టీ... ఫెయిల్యూర్!

By Bojja Kumar

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన భార్య స్నేహా రెడ్డి బర్తేడే సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీ కాస్త అనుకోని కారణాలతో ఫెయిల్యూర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ఇంగ్లీష్ డైలీ కథనం ప్రకారం శనివారం రాత్రి(సెప్టెంబర్ 30)న స్నేహా రెడ్డి బర్త్ డే సందర్భంగా బన్నీ తన కొత్త గెస్ట్ హౌస్‌లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసాడు.

ఈ వేడుకకు దాదాపు 80 మంది అతిథులు హాజరయ్యారని, రామ్ చరణ్-ఉపాసనతో పాటు బన్నీకి అత్యంత సన్నిహితులు హాజరైనట్లు తెలుస్తోంది. ఎకరం విస్తీర్ణంలో దాదాపు 7000 చదరపు అడుగుల మేర బన్నీ కొత్త గెస్ట్ హౌజ్ విస్తరించి ఉంది. గెస్ట్ హౌజ్ చుట్టు ఉన్న గార్డెన్ లో పార్టీ జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసారు. ధనవంతుల పార్టీలో ఉండే అన్ని ఐటమ్స్ రెడీ అయ్యాయి. అయితే ఆ రోజు రాత్రి భారీ వర్షం కురవడంతో అంతా అప్ సెట్ అయ్యారని, ఎన్నో అంచనాలతో ఏర్పాటు చేసుకున్న పార్టీ సక్సెస్ కాక పోవడంతో బన్నీ మూడ్ మారిపోయిందని తెలుస్తోంది.

ఈ గెస్ట్ హౌస్‌లో విశాలమైన స్విమ్మింగ్ ఫూల్ తదితర ఏర్పాట్లతో పాటు ఓపెన్ రూఫ్ ఉన్న బెడ్ రూమ్‌ను ప్రత్యేకంగా నిర్మించినట్లు తెలుస్తోంది. బెడ్ రూమ్ నుంచి నేరుగా ఆకాశంలో చుక్కలను చూస్తూ కబుర్లు చెప్పుకోవచ్చన్నమాట. అదే విధంగా స్నేహితులు, బంధువులతో కలిసి పార్టీలు చేసుకోవడాని బెస్ట్ ప్లేసుగా దీన్ని తీర్చి దిద్దారు. ఈ ఇంటి కోసం కోట్ల రూపాయలు వెచ్చించారట. పుట్టుకతోనే చాలా రిచ్ అయిన బన్నీకి ఇలాంటి ఇల్లు నిర్మించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

అల్లు అర్జున్, స్నేహా రెడ్దిల వివాహం ఇటీవలే అంగ రంగ వైభవం గా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఇల్లు అల్లు అర్జున్ మామగారు పెళ్లి కానుకగా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గచ్చిబౌలిలోని విప్రో జంక్షన్లో నిర్మించిన ఈ గెస్ట్ హౌస్ ఇంటర్నేషనల్ స్టాండర్స్, అత్యాధునిక ఆర్కిటెక్చర్‌‍తో నిర్మించారు.

బన్నీ సినిమాల విషయానికొస్తే... అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందబోయే 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి ముహూర్థం ఖరారైంది. అక్టోబర్ 17న ఈచిత్రం పూజా కార్యక్రమం నిర్వహించి అక్టోబర్ 25నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే 'గబ్బర్‌ సింగ్‌' వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా నిర్మించిన పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ అధినేత బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X