ఒకరికి తెలీయకుండా మరొకరికి అల్లు అర్జున్ గాలం

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' . ఇటీవలే స్పెయిన్‌లో చిత్రీకరణ మొదలయింది. సింహ భాగం అక్కడే చిత్రీకరిస్తారు. ఈ చిత్రంంలో...అల్లు అర్జున్ పాత్ర డిఫెరెంట్ గా సాగుతుంది. ఒకేసారి ఇద్దరికి లైన్ వేస్తూంటారు. ఇద్దరికి ఒకరంటే మరొకరికి పడదు. అయినా ఒకరికి తెలీయకుండా మరొకరికి గాలం వేశాడు. టైమ్‌ టేబుల్‌ ప్రకారం ఇద్దరి దగ్గరా ప్రేమ పాఠాలు వల్లించాడు ఈ అల్లరి ప్రేమికుడు. అయితే అందుకు ఓ కారణం ఉంది. అదేమిటి? ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమలోకి ఎందుకు దించాల్సి వచ్చింది? ఈ విషయాలు తెలియాలంటే 'ఇద్దరమ్మాయిలతో' సినిమా చూడాల్సిందే అంటున్నారు.

అమలాపాల్‌, కేథరిన్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్‌ నిర్మాత. 'ప్రేమ, వినోదం మేళవించిన కథ ఇది. రొమాంటిక్‌గా సాగుతుంది. ముక్కోణపు ప్రేమ కథలో మలుపులు ఆద్యంతం ఆకట్టుకొంటాయి''అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రం కాన్సెప్టు ఏమిటంటే...తనని తాను ప్రేమించుకోవడమే కాదు... ఆ ప్రేమని మరొకరికి పంచడం కూడా తెలిసిన కుర్రాడతను. ఒకరికి వాటా ఇస్తే... ఇబ్బంది లేకపోదును. ప్రేమ మరీ ఎక్కువైపోయి... ఒకేసారి ఇద్దరికి మనసిచ్చేశాడు. ఆ ప్రేమాయణం ఏ తీరానికి చేరిందో తెలియాలంటే 'ఇద్దరమ్మాయిలతో' సినిమా చూడాలి అని చెప్తున్నారు.

'ఇడియట్‌', 'దేశముదురు' తరవాత ఓ పూర్తిస్థాయి ప్రేమ కథని తెరపై చూపిస్తున్నారు పూరి. ఇద్దరు హీరోయిన్స్ తో నటించడం అల్లు అర్జున్‌కీ ఇదే తొలిసారి. ఈ సినిమా కోసం అమలాపాల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకొంది. బ్యాంకాక్‌లో ఆమెపై ఓ పోరాట సన్నివేశం కూడా తీర్చిదిద్దారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

నిర్మాత బండ్ల గణేష్ ఖర్చుకు వెనకాడకుండా బన్నీ ఇమేజ్ కు తగిన విధంగా స్టైలిష్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీనీ లవర్ బాయ్‌లా చూపెట్టబోతున్నాడు దర్శకుడు పూరి. దేవిశ్రీప్రసాద్‌ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X