»   » హాలీవుడ్ సినిమా చేయబోతున్న అల్లు అర్జున్!

హాలీవుడ్ సినిమా చేయబోతున్న అల్లు అర్జున్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారట. ఇంకా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వని బన్నీ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంపై ఫిల్మ్ నగర్ జనాలు ఆశ్యర్య వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదేదో గాలి వార్త మాత్రం కాదంటున్నారు.

హాలీవుడ్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన ఓ మళయాల ఫిల్మ్ మేకర్ ఇటీవల బన్నీని కలిసి హాలీవుడ్ ప్రాజెక్టు గురించి చెప్పాడని, ఆసక్తికరంగా ఉండటంతో బన్నీ కూడా ఓకే చెప్పాడని అంటున్నారు. బన్నీకి ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చే విధంగా ఈ ప్రాజెక్టు ఉండటంతో అల్లు అరవింద్ కూడా ఆసక్తి చూపినట్లు టాక్. తెలుగు, ఇంగ్లీష్ లో తెరకెక్కే ఈ ప్రాజెక్టు విషయాలన్నీ ప్రస్తుతం గోప్యంగా ఉంచుతున్నారు. ఫైనల్ కన్ఫర్మేషన్ అయిన తర్వాతే సినిమా విషయాలు బయట పెట్టనున్నారు.

Allu Arjun in Hollywood project

ప్రస్తుతం అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాకి ఇద్దరమ్మాయిలతొ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ ని కంపోజ్ చేసిన కెచ్చాను తీసుకున్నట్టు సమాచారం. కెచ్చా..ధాయిలాండ్ కు చెందిన ఫైట్ మాస్టర్.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫైట్ షూటింగ్ తో ఈ నెల 19 నుండి ప్రారంభించనున్నారు. ఈ సినిమా ఈ మధ్యనే లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కనపడనుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

English summary
Allu Arjun has heard a brief storyline from a Malayalam filmmaker (who also assisted for few Hollywood projects) which happens to be a project in Telugu along with English!
Please Wait while comments are loading...