‘సరైనోడు’ షూటింగులో గాయపడ్డ అల్లు అర్జున్

By Bojja Kumar

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శీను డైరెక్షన్‌లో ‘సరైనోడు' చిత్రం షూటింగులో గాయపడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి సమాచారం లేక పోయినా....ఇటీవల ల్యాండ్ కేసు విషయంలో రంగా రెడ్డి కోర్టుకు హాజరైన సందర్భంలో, నిన్నఅల్లు రామలింగయ్య జాతీయ పురస్కార వేడుకలో బన్నీ కుడి చేతికి కట్టుతో కనిపించడమే ఈ ప్రచారానికి కారణమని తెలుస్తోంది.

అల్లు అర్జున్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు' టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. పవర్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ భిన్నకోణాల్లో సాగుతుందని తెలిసింది.

బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తొలిసారిగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే అభిమానులకు పండగ ట్రీట్ ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నారట.

 Allu Arjun injured on the sets of 'Sarainodu'

తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు'' అని బోయపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X