న్యూ లుక్ ...టట్టూలతో అల్లు అర్జున్
హైదరాబాద్ : అల్లు అర్జున్ తన తాజా చిత్రం ఇద్దరు అమ్మాయిలతో ...కోసం ప్రత్యేకంగా మెడపై,వీపుపై, చేతిపై టట్టూలు వేయించుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆయన మోడ్రన్ ప్రేమికుడుగా కనిపిస్తాడు. చేతిలో ఎప్పుడూ గిటార్ పెట్టుుకని..తన ప్రేమ కోసం ఏదైనా చేసే పాత్రలో అల్లు అర్డున్ అదరకొట్టనున్నాడని సమాచారం. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్ దగ్గరనుంచి ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ పై చేసిన ఫోటో షూట్ అదిరిపోయిందని,త్వరలోనే వాటితో ఫస్ట్ లుక్ వదులుతారని సమాచారం.
ఇక ఈ చిత్రం కోసం పూరి జగన్నాధ్..ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్స్ ని తీసుకు వచ్చారు. వారు యోక్షన్ సీన్స్ ప్రత్యేకంగా ఇప్పటివరకూ తెరపై రాని విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే లొకేషన్స్ కూడా ఇప్పటివరకూ చూడనట్లు ఉండాలని, అంతా కొత్తగా ఉండాలని పూర్తి జాగ్రత్తలతో పూరీ దిగుతున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ 2013 లో మెగా హిట్ గా నిలవాలని ప్లాన్ చేస్తున్నారు.
'ఇద్దరమ్మాయిలతో' అనే సినిమా టైటిల్ ట్రేడ్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎప్పుడూ వెరైటీ టైటిల్స్‌తో సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి స్క్ర్రిప్టుని డిఫెరెంట్ గా పూర్తి స్ధాయి వినోదం తో సమకూర్చినట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి 'దేశముదురు' సినిమా చేశారు. అది అర్జున్‌కు మాస్ ఇమేజ్‌ను పెంచింది. పాత్ర ప్రకారం బన్ని ఈ చిత్రంలో వెరీటీ గెటప్స్ లో, రకరకాల కాస్ట్యూమ్స్ తో కనపడతాడని తెలుస్తోంది. అమలాపాల్, కేధరీన్ తెరీసా హీరోయిన్స్ .
'జులాయి' సినిమాతో తన జోష్ చూపించారు అల్లు అర్జున్. ఆకతాయి కుర్రాడిగా బన్నీ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు ప్రేమికుడి అవతారం ఎత్తుతున్నారు. ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ప్రేమలోకి దింపేస్తున్నారు. ఆ సినిమానే 'ఇద్దరమ్మాయిలతో'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లుఅర్జున్‌తో అమలాపాల్, కేథరిన్ ఆడిపాడనున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. ఈనెల 19 నుంచి బ్యాంకాక్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తారు. అక్కడ కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కిస్తారు. సింహభాగం విదేశాల్లోనే షూటింగ్ జరగనుంది. చాలాకాలం తరవాత పూరి తెరకెక్కిస్తున్న ప్రేమకథ ఇది. వినోదం, యాక్షన్ సన్నివేశాలకూ చోటుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఓ పాటను సిద్ధం చేశారు.


Click it and Unblock the Notifications











