ఇన్నోవేటివ్ స్టెప్స్ తో అలరించనున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్...!
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ప్రారంభించిన అల్లు అర్జున్ ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ…రిస్క్ తీసుకోవాటనికి ఎవ్వరూ వర్రీ కావాల్సిన పనిలేదు. నా వరకూ నేను రిస్క్ తీసుకోవటానికి రెడీ. రిస్క్ లు అనేవి మనలో ఒక రకమైన ఆశావహ దృక్పధాన్ని తీసుకువస్దాయి. మీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చేయండి అందులో రిస్క్ చేయాల్సి వచ్చినా సరే అన్నారాయన. అలాగే ఆస్ట్ర్రేలియాలో సర్జరీ చేయించుకుని వచ్చిన బన్నీ.. త్వరలోనే డాన్స్ ప్లోర్ కి వెళ్తాను. నా తదుపరి చిత్రంలో ఇన్నోవేటివ్ స్టెప్స్ చేసి అలరిస్తాను అని హామీ ఇచ్చారు.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం నవంబర్ 2, 2011న ప్రారంభమైన విషయం విధితమే. రామానాయుడు స్టూడియోలో ఘనంగా ఈ లాంచింగ్ చేసినారు. ఎన్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ గా మొదట సుదీప్ ని అనకున్నా ఫైనల్ గా సోనూ సూద్ నే ఎంపిక చేసారు. ఇక నవంబర్ 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇలియానా కూడా ఆ రోజునుంచి షూటింగ్ లో పాల్గొంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. దీనికోసం ఇటీవల ముంబయిలోని హకీమ్స్ అలీమ్ అనే సెలూన్ లో కొత్త రకం హెయిర్ స్టయిల్ చేయించుకున్నారు. ఈ లుక్ చాలా చాలా బాగుందని అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ అంటున్నారు. నాకైతే ఇప్పుడే అన్నయ్య ఫొటో విడుదల చేయాలని ఉంది. కానీ నా బ్రదర్ మాత్రం ఒకేసారి ఫస్ట్ లుక్ విడుదల చేద్దామంటున్నాడు. పోస్టర్ లో డెరైక్ట్ గా చూస్తేనే ప్రభావం ఉంటుందని తన అభిప్రాయం అని అల్లు శిరీష్ ట్విట్టర్‌లో పెట్టారు.
ఇతర ముఖ్యపాత్రల్లో రాజేంద్రప్రసాద్,కోట శ్రీనివాసరావు,బ్రహ్మానందం, తణికెళ్ల భరిణి, ఎమ్ ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, బ్రహ్మాజి, రావు రమేష్, ప్రగతి,తులసి,హేమ తదితరులు నటించనున్నారు. అరవీందర్ ఆర్ట్ దర్శకత్వం, పీటర్ హెయిన్స్ ఫైట్స్ అందిస్తారు.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











